అన్ సీజన్ లో SVSC రీరిలీజ్ సెన్సేషన్, కుమ్మేస్తున్న ఓపెనింగ్స్!!

Published : Mar 07, 2025, 05:45 AM IST

SVSC Re-Release: వెంకటేష్, మహేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రీ రిలీజ్ అవుతోంది. విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు కోట్లు వసూలు చేసింది.

PREV
13
 అన్ సీజన్ లో  SVSC రీరిలీజ్ సెన్సేషన్, కుమ్మేస్తున్న ఓపెనింగ్స్!!


SVSC Re-Release:  వెంకటేశ్‌ (Venkatesh), మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). దిల్‌ రాజు (Dil Raju) నిర్మాత. 2013లో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్టైంది.

 తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవటంతో ఈ సినిమని క్లాసిక్ సినిమాగా మార్చేసారు. సుమారు 12 ఏళ్ల తర్వాత మార్చి 7న ఇది రీ రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో ఈ చిత్రం డే వన్ ...అడ్వాన్స్ బుక్సింగ్స్ ఎలా ఉన్నాయి,

రీరిలీజ్ ...దిల్‌ రాజు  బాగా డబ్బులు తెచ్చిపెడుతుందా, అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా చూద్దాం.

23


ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు  SVSC చిత్రం రీ రిలీజ్ డే 1 రోజు ఫైనల్ అడ్వాన్స్ బుక్కింగ్స్ టోటల్ 2 కోట్లు దాటిందని తెలుస్తోంది. హైదరాబాద్ సిటీలోనే 75 లక్షలు దాకా అడ్వాన్స్ బుక్కింగ్స్ అయ్యాయని తెలుస్తోంది.

అలాగే  తెలుగు రెండు రాష్ట్రాల్లోని మిగిలిన ఏరయాల్లో మొత్తం బుక్కింగ్స్ 1.8 కోట్లు దాగా ఉన్నాయని, అలా మొత్తం మీద రెండు కోట్లు ఓ రీరిలీజ్ చిత్రం తేవటం గొప్ప విషయమే అంటున్నారు. వీకెండ్ లలో టిక్కెట్ లలో జంప్ ఉంటుందని, బుక్ మై షోలో అమ్మాకాలు బాగున్నట్లు సమాచారం. అన్ని చోట్ల మొదటి రోజు రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మొదటిసారి వెంకీతో నటించినా మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఉపిరిపోసిన మహేష్ ఈ సినిమాతో 55 కోట్ల షేర్స్ ను అందించాడు. బడ్జెట్ - 50 కోట్లు

33


దిల్ రాజు మాట్లాడుతూ... ‘‘ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ రాణిస్తోన్న ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదనే స్టేట్‌మెంట్‌ ఎంతగానో ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మా సినిమా ఓటీటీలో, టీవీల్లోనూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసారమైంది.

అయినప్పటికీ రీ రిలీజ్‌లో వెండితెర వేదికగా దీనినిచూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్‌ ఉంటే చూడటానికి ఆడియన్స్‌ ఎప్పుడూ ముందుంటారు. మహేశ్‌, వెంకటేశ్‌ అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా దీనిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియన్స్‌ రియాక్షన్‌ చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి సినిమాలు చేయడానికే మనం ప్రయత్నించాలని ఇలాంటి రీ రిలీజ్‌లు మరోసారి స్పష్టం చేస్తున్నాయి’’ అని దిల్‌ రాజు చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories