అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే

Published : Mar 06, 2025, 07:44 PM IST

టాలీవుడ్ లో  పవర్ కపుల్ స్టార్ కపుల్స్ లో  అల్లు అర్జున్,  స్నేహ రెడ్డి కూడా ఉన్నారు. పెళ్లై  15 సంవత్సరాలు అవుతుండగా.. ఈ స్టార్ కపుల్ ఆస్తులు ఎన్ని కోట్లు, వారి సంపాదన ఎంత..? వీరిద్దరి లవ్ స్టోరీ ఎక్కడ మొదలయ్యింది. ఐకాన్ స్టార్ ఫ్యామిలీ డీటేల్స్ చూద్దాం. 

PREV
16
అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే
Allu Arjun

అల్లు అర్జున్ టాలీవుడ్‌ స్టార్ హీరో.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో కూడా. పుష్ప రెండు సినిమాలతో ఆయనకు భారీగా ఇమేజ్ వచ్చింది. బాహుబలి సినిమాను దాటి కలెక్షన్లు సాధించింది పుష్ప2 సినిమా.

మధ్యలో చాలా ఆటుపోట్లు ఫేస్ చేసిన అల్లు అర్జున్.. తన ఫ్యామిలీకి చాలా ఇపార్టెన్స్ ఇస్తాడు. మరీ ముఖ్యంగా  అతని భార్య స్నేహ రెడ్డి అంటే బన్నీకి ప్రాణం. ఈ జంట ఎప్పటి కప్పుడు తమ స్ట్రాంగ్ బాండింగ్ ను రకరకాల రూపాల్లో వెల్లడిస్తూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో వీరి పోస్ట్ ల ద్వారా ఒకరికొకరు ఎంత ప్రేమించుకుంటున్నారో ఫ్యాన్స్ కు అర్ధం అవుతూనే ఉంది. ఇక పెళ్ళి తరువాత భరీగా ఆస్తులు కూడబెట్టాడట బన్నీ. వరుస విజయాలతో రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో పాటు.. రకరకాల బిజినెస్ లలో బెట్టుబడులు పెట్టి కోట్లు వెనకేసుకున్నారట ఈస్టార్ జంట. 

Also Read: 70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?
 

26
అల్లు అర్జున్‌.. స్నేహారెడ్డిని

అల్లు అర్జున్ , స్నేహ రెడ్డిల ప్రేమకథ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మొదలయ్యింది. వీరి పెళ్ళై 15 ఏళ్లు  అవుతోంది. ఎవరిదో తెలియదు కాని ఒక పెళ్లిలో వీరు కలుసుకున్నారు. అల్లు అర్జున్ స్నేహను మొదటి చూపులోనే ప్రేమించాడు,

అప్పటి నుంచి ఆమెనే ప్రేమిస్తు వచ్చిన ఆయన పెద్దల ద్వారా వారిని అప్రోజ్ అయ్యారు. ఈలోపు వీరిద్దరు ప్రేమించుకోవడం.. ఒకరిని మరొకరు అర్ధం చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక పెద్దల ఒప్పందంతో వీరు 2010 లో నిశ్చితార్థం చేసుకున్నారు,  2011 లో వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరిగింది.

Also Read: 4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?

36

ఇక వీరికి ఇద్దరు పిల్లలు  ఉన్నారు, అల్లు అయాన్, 2014 లో జన్మించగా..  అల్లు అర్హ, 2016 లో జన్మించింది.టాలీవుడ్ లో స్టార్ కపుల్ మాత్రమే కాదు.. భారీగా ఆస్తులు ఉన్న జంటగా అల్లు అర్జున్ ‌, స్నేహ రెడ్డి  ఉన్నారు.

బన్నీ ఆస్తులు 500 కోట్లు పైనే ఉంటాయని అంచనా. అంతే కాదు పుష్ప తరువాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 100 కోట్లకు పైగా పెరిగిందని తెలుస్తోంది. సినిమా లాభాల్లో శేర్ కూడా తీసుకుంటున్నాడట ఐకాన్ స్టార్.

Also Read:గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?

 

46

ఇక బన్నీకి తాత అల్లు రామలింగయ్య, తండ్రి అరవింద్ నుంచి కూడా ఆస్తి కలిసి వస్తుంది. ఇక ఇది కాకుండా బన్నీ మామ చంద్రశేఖర్ పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ కావడంతో స్నేహారెడ్డి పేరిట కూడా కొంత ఆస్తి ఉన్నట్టు తెలుస్తోంది.

స్నేహా రెడ్డి పేరుతో దాదాపు 42 కోట్ల విలువైన  ఆస్తులు ఉన్నాయని సమాచారం. అంతే కాదు బన్నీ బ్రాండ్ ప్రమోషన్స్, రియల్ ఎస్టేట్, హోటల్స్  లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టారట. 

Also Read:కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

56

ఇక స్నేహ రెడ్డి గురించి తెలసుకుందటే ఆమె  బాగా చదువుకున్న కుటుంబం నుండి వచ్చింది, ఆమె తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారవేత్త ఆమె హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్కూల్ చదువు, కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసింది. ఆమె USAలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేసింది.

Also Read:అంతరంగాలు హీరోయిన్ కి లైంగిక వేధింపులు, అశ్విని ని రూమ్ కు పిలిచిన దర్శకుడు ఎవరు?

66

అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో 26.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో భారీ ఫాలోయింగ్ ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ప్రకటనల కోసం దాదాపు 20 కోట్ల వసూలు చేస్తారట అల్లు అర్జున్.

ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం 6 నుండి 8 కోట్లు కూడా వసూలు చేస్తాడు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు హైదరాబాద్‌లో ఒక ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ తో పాటు  రెస్టారెంట్ చైన్‌ కూడా ఉంది.  

అల్లు అర్జున్ తన ఫ్యామిలీ నడిపిస్తున్నటువంటి  గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ అండు డిష్ట్రూబ్యూషన్ కంపెనీలో కూడా పార్ట్నర్ గా ఉన్నాడు. అంతే కాదు రీసెంట్ గా థియేటర్లు, మల్టీ ప్లక్స్ లో కూడా అడుగు పెట్టాడు బన్నీ. హైదరాబాద్‌లో తన సొంత మల్టీప్లెక్స్, AAA సినిమాస్‌ను ప్రారంభించాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories