సిద్ధార్థ్ మృతితో కుప్పకూలిన నటి.. అమ్మాయితో మాట్లాడినా సహించలేదు, వారిద్దరి ప్రేమ కథ ?

First Published Sep 2, 2021, 4:21 PM IST

బిగ్ బాస్ 13 విజేత సిద్దార్థ్ శుక్లా మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.సిద్దార్థ్ సహనటులు, స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అతడి కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది.

బిగ్ బాస్ 13 విజేత సిద్దార్థ్ శుక్లా మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.సిద్దార్థ్ సహనటులు, స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అతడి కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్దార్థ్ 40 ఏళ్ల వయసులోనే మరణించడం జీర్ణించుకోలేని అంశంగా మారింది. 

గురువారం ఉదయం సిద్దార్థ్ శుక్లా తీవ్రమైన గుండెపోటు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా సిద్ధార్థ్ నిలిచాడు. బిగ్ బాస్ లో అతడికి నటి షెహనాజ్ గిల్ పరిచయం కావడం.. వారి మధ్య ప్రేమ చిగురించడం అందరికి తెలిసిందే. 

వీరిద్దరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పటికి వీరిద్దరూ ప్రేమికులుగా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి మధ్య లవ్, రొమాన్స్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

సిద్దార్థ్ మరణ వార్త తెలియగానే షెహనాజ్ గిల్ షూటింగ్ లొకేషన్ లో కుప్పకూలిపోయింది. వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. బిగ్ బాస్ హౌస్ లో సిద్దార్థ్ తో మరో అమ్మాయి మాట్లాడినా షెహనాజ్ ఒప్పుకునేది కాదు. తను నా వాడు అని చెప్పేది. అంతలా సిద్ధార్థ్ ని ప్రేమించింది షెహనాజ్. ఇప్పడు అతడే దూరం కావడంతో ఆమె పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. 

సిద్దార్థ్ మృతిపై షెహనాజ్ తండ్రి స్పందించారు. ఈ రోజు జరిగిన విషయం మా మనసుకి బాధ కలిగించేది. నా కుమార్తె షెహనాజ్ తో మాట్లాడాను.. ఆమె పరిస్థితి బాగాలేదు అని ఆయన అన్నారు. 

వీరిద్దరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సిద్ధార్థ్ షెహనాజ్ జంటకు ప్రత్యేకమైన అభిమానులే ఉన్నారు. సిధ్నాజ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

 బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగింది. సిద్దార్థ్ షెహనాజ్ జంట చివరగా డాన్స్ దివానే 3షోలో పాల్గొని సందడి చేశారు. వీరిద్దరి బిగ్ బాస్ హౌస్ రొమాన్స్,ఇతర వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

click me!