Sidharth Shukla మృతి: తెరపైకి రెండు వాదనలు.. ఆరోజు రాత్రి ఏం జరిగింది, ఫ్రెండ్స్ కు చెప్పాడా ?

First Published Sep 3, 2021, 2:26 PM IST

ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ సిద్దార్థ్ శుక్లా గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచి వేస్తోంది. అతడి కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ అండ్ హ్యాండ్సమ్ సిద్దార్థ్ శుక్లా గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచి వేస్తోంది. అతడి కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. గురువారం ఉదయం సిద్ధార్థ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపే సిద్ధార్థ్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. 

సిద్ధార్థ్ మృతి తర్వాత కొన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి. అందరూ అతడికి సహజ మరణమే అని భావిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలింది. 

ఇక ఇంటర్నల్ పార్ట్స్ ని కెమికల్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఈ టెస్ట్ తర్వాత సిద్ధార్థ్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇదిలా ఉండగా ఆ ముందు రోజు రాత్రి సిద్దార్థ్ ఎలా ప్రవర్తించాడు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఏమైనా మాట్లాడాడా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రెండు వాదనలు తెరపైకి వచ్చాయి. సిద్దార్థ్ కు హెవీగా జిమ్ కసరత్తులు చేసే అలవాటు ఉందట. ఆరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు, విశ్రాంతి కావాలని పడుకున్నాడని అతడి ఫ్రెండ్స్ మీడియాకు చెప్పారు. 

అయితే శుక్లా ఆ ముందు రోజు ఎలాంటి కసరత్తులు చేసాడు అనేది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకే తెలియాలి. ఇదిలా ఉండగాసోషల్ మీడియాలో మరో వాదన కూడా వైరల్ అవుతోంది. కాకపోతే అది ఫేక్ అని తేలింది. 

జిమ్ చేసిన అనంతరం శుక్లా మెట్లు ఎక్కుతూ గుండెపోటుతో పడిపోయినట్లు ఓ సిసి టివి ఫుటేజ్ వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో ఉన్నది సిద్దార్థ్ కాదని తేలింది. ఆ వీడియో బెంగుళూరుకి చెందినది. అది కూడా ఆగష్టు 25న రికార్డ్ అయినా ఫుటేజ్. దీనితో ఈ ప్రచారం ఫేక్ అని తేలింది. 

ఇక కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం సిద్ధార్థ్ జిమ్ వర్కౌట్స్ చేయడం వల్ల గుండెపోటు వచ్చినట్లు మరికొందరు వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సిద్దార్థ్ మృతి పట్ల స్పందించే స్థితిలో అతడి కుటుంబ సభ్యులు లేరు. సిద్దార్థ్ కు అతడి తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సిద్దార్థ్, నటి షెహనాజ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 

click me!