ముచ్చటగా ముగ్గురితో ఆర్యన్ ఖాన్ డేటింగ్..? షారుఖ్ ఖాన్ తనయుడు తక్కువోడు కాదుగా..!

First Published Jan 29, 2024, 2:14 PM IST

హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. రొమాంటిక్ ఇమేజ్ ను సాధించాడు బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్. బీటౌన్ లో ముగ్గురు హీరోయిన్లతో ముచ్చటగా డేటింగ్ చేశాడట ఆర్యన్.. మరి ఎవరా హీరోయిన్లు.. 
 

ఆర్యన్ ఖాన్.. స్టార్ హీరో కాదు.. స్టార్ కిడ్ మాత్రమే.. కాని స్టార్ హీరోలను మంచిన ఇహేజ్ ఉంది బాలీవుడ్ లో అతనకి. హీరోయిన్లు కూడా హాయ్ హ్యాండ్సమ్ అంటూ అతని చూుట్టుు తిరుగుతుంటారు. సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల రిలేషన్ షిప్ గురించి వార్తలు రావడం సహజం.. కాని.. ఇండస్ట్రీలో లేని ఆర్యన్ గురించి.. అతని డేటింగ్స్ గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 

 షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆమధ్య డ్రగ్ కేసుతో సంచలనం అయ్యాడు. డ్రగ్స్ కేసు నుంచి బయటపడిన తరువాత ఆర్యన్ ఒక  పాకిస్థాన్ మోడల్, నటితో డేటింగ్ చేస్తున్నట్టుగా నెట్టింట గుసగుసలు వినిపించాయి. అయితే ఆ పాకిస్తాన్ నటి ఎవరో కాదు.. సాదియా ఖాన్. వీరిద్దరు క్లోజ్ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో.. నెటిజన్లు వీరిద్దరి రిలేషన్ పై రకరకాల వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ‌,  సాదియా  రిలేషన్ లో ఉన్నారని.. వారి మధ్య ప్రేమ చాలాస్ట్రాంగ్ గా ఉందని.. ఇద్దరు కలిసి తిరుగుతూ..  డేటింగ్ లో ఉన్నారని రకరకాలుగా వార్తలు హల్ చల్ చేశాయి. 
 

Latest Videos


అసలు దీనికంతటికీ కారణం..   రీసెంట్ గా పాకిస్థానీ నటి, మోడల్ సాదియా ఖాన్‌ను కొద్ది రోజుల క్రితం, దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలో  ఆర్యఖాన్  కలిశాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఫోటోనే అసలు తంటా తీసకువచ్చింది. ఈఫోటోలో వారు క్లాజ్ గా కనిపించడంతో.. కాస్త తేడాగా అనిపించి అది కాస్తా..డేటింగ్ పుకార్లకు దారితీసింది. 

Image: Reddit Forum Thread

ఇక ఆర్యన్ ఖాన్ తో రిలేషన్ లో ఉంది అనుకుంటున్న మరో హీరోయిన్ నోరా ఫతేహా. ఈమెతో కూడా ఆర్యన్ ఖాన్ ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కాకపోతే వీరి మధ్య వయస్సు తేడా చాలా ఉంది.  అయితే బాలీవుడ్ లో రిలేషన్ షిప్ లకు వయస్సు తేడాలు పెద్దగా చూడరు.. అర్జున్ కపూర్, మలైకాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపులు. అలాగే పాపులర్ ఐటం సాంగ్స్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఆర్యన్ రిలేషన్ లో ఉన్నాడు అంటూ తాజాగా వార్తలు వచ్చాయి. 
 

వార్తలు ఊరికే రావు కదా.. దానికీ ఓ కారణం ఉంది. వారిద్దరు చనువుతో దిగిన ఫోటోల వల్ల ఈ రూమర్స్ గట్టిగా బయటకువచ్చాయి.   ఆర్యన్ కి 25 ఏళ్లు. కానీ నోరాకి 30 ఏళ్ల వయసు. వీరిద్దరు ఇటేవలే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయిలో జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు దిగిన ఫోటోలే వీరి రిలేషన్ ని లవ్ రిలేషన్ గా ముద్రించాయి. దీంతో బాలీవుడ్ సినీ వర్గాలత్లో ఆర్యన్, నోరా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా  కోడై కూసింది. 
 

Image: Aryan Khan, Ananya PandayInstagram

ఈ ఇద్దరే కాదు నటి అనన్య పాండేతో కూడా ఆర్యన్ ఖాన్ ప్రేమలో ఉన్నాడంటున్నారు సోషల్ మీడియా జనాలు. అయితే ఈ న్యూస్ మాత్రం డైరెక్ట్ గా ఆనన్య నోటి నుంచే వచ్చింది. ఈమధ్య  అనన్య పాండే కాఫీ విత్ కరణ్ షో లో ఈ విషయం ఒప్పుకుంది. ఆర్యన్ తో ప్రేమలో ఉన్నారా అంటే అవును అతను ముద్దుగా ఉంటాడు, నాకు ఆర్యన్ పై క్రష్ ఉంది. అని చెప్పింది. వీరిద్దరు కలిసి బయట కనిపించడంతో.. ఇక ఈ విషయంలో జనాలు ఫిక్స్ అయిపోయారు. 
 

ఇలా ఆర్యన్ ఖాన్ రొమాంటిక్ జర్నీన్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇలా ఇప్పటికే ముగ్గురి విషయంలో ఆర్యన్ ఖాన్ గాసిప్స్ ఎదుర్కొన్నాడు. అవి నిజమో కాదో  తెలియదు. రిలేషన్ షిప్ వార్తల గురించి ఎవరై క్లారిటీ కూడా ఇవ్వరు. అయితే ఒక్కరు మాత్రం ఈ వార్తలను ఘాటుగా ఖండించింది. ఆమె సాధియా ఖాన్.  అసలు విషయం ఏంటో  తెలియకుండా ఇష్టం వచ్చినట్టు రాశేస్తారా అని మండిపడింది. ఫోటో దిగితే రిలేషన్ లో ఉన్నట్టా అని ఘాటుగా బదులిచ్చింది. ఒక్కఫోటోతో డేటింగ్ అంటూ రాయడం విచిత్రంగా ఉంది అంటూ అసహనం వ్యక్తం చేసింది బ్యూటీ. 
 

click me!