ఈ రోజుల్లో పొడవైన గడ్డాన్ని పెంచడం ట్రెండీగా మారింది. ముఖ్యంగా యువకులు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ ప్రతి ఒక్కరి గడ్డం ఒకేలా పెరగదు.
అంటే కొంతమంది అబ్బాయిలకు గడ్డం చిన్నగా ఉంటే.. కొంతమందికి మాత్రం పెద్దగా పెరుగుతుంటుంది. గడ్డం సరిగ్గా లేనివారు పెరిగేందుకు మార్కెట్ లోకి వచ్చిన రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు.
అయితే మీరు కూడా సెలబ్రిటీల మాదిరిగా హెవీ గడ్డం లుక్ లో కనిపించాలంటే మాత్రం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. ఇందుకోసం మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
ఇవి మీ డైట్ లో చేర్చుకోండి
గడ్డం బాగా పెరగాలంటే మీ రోజువారి ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం క్యారెట్లు, గుడ్లు, బచ్చలికూర, జున్ను, చేపలు, కాయధాన్యాలు, ఆకుకూరలను తినండి.
అలాగే ఒమేగా 3 ఆమ్లాలు కూడా గడ్డం జుట్టు మూలాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి ఇందుకోసం సాల్మన్, ట్యూనా ఫిష్ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
హైడ్రేట్
తల వెంట్రుకలు రాకుండా ఉండటానికి, గడ్డం బాగా పెరిగేందుకు మీరు హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం మీరు పుష్కలంగా నీళ్లను తాగాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి.
నిజానికి విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి.
పోషణ కోసం మసాజ్
గడ్డం బాగా పెరగడానికి మసాజ్ ఖచ్చితంగా చేయాలి. ఈ మసాజ్ రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే వెంట్రుకలకు మంచి పోషణను అందిస్తుంది. వెంట్రుకలు బాగా పెరగడానికి సహాయపడతాయి.
కాబట్టి కొబ్బరి నూనె, జోజోబా ఆయిల్ లేదా ఆముదం వంటి సహజ నూనెలను అప్లై చేసి చేతులతో గడ్డాన్ని మసాజ్ చేయండి. అలాగే గడ్డం తేమగా ఉండాలంటే గడ్డానికి ఫ్రెష్ కలబంద జెల్ ను అప్లై చేయండి.
గడ్డానికి ఆవిరి
ఆవిరితో కూడా మీ గడ్డం బాగా పెరుగుతుంది. దీని కోసం నీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి అది మరిగే వరకు వేడి చేయండి.
ఆ తర్వాత దాని నుంచి వెలువడే ఆవిరితో గడ్డాన్ని ఆవిరి పట్టండి. ఇలా చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుని రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల గడ్డం బాగా పెరుగుతుంది.