నవ్వుల పాలవుతున్న హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్.. షాకిస్తున్న ఆదిత్య, పృథ్వీ బిహేవియర్

First Published | Sep 7, 2024, 7:31 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సూపర్ హిట్ చిత్రంలో హీరోగా ఆదిత్య నటించారు. 

Bigg Boss Telugu season 8 aditya om and prithviraj shetty shocking behaviour dtr

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో హైయెస్ట్ పైడ్ కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సూపర్ హిట్ చిత్రంలో హీరోగా ఆదిత్య నటించారు. మరి అలాంటి కంటెస్టెంట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ ఫస్ట్ వీక్ లో ఆదిత్య ఓం బిహేవియర్ చూస్తే కచ్చితంగా జీరో మార్కులు వేయొచ్చు అంటూ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. 

Bigg Boss Telugu season 8 aditya om and prithviraj shetty shocking behaviour dtr

ఆదిత్య ఓంకి ఎపిసోడ్ కి బిగ్ బాస్ నిర్వాహకులు 5 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట. ఆదిత్య ఏదో మొక్కుబడిగా మాట్లాడుతున్నట్లు ఉంది తప్ప.. బిగ్ బాస్ హౌస్ ని ఎంజాయ్ చేస్తూ, కంటస్టెంట్స్ లతో కలసి పోతున్నట్లు లేదు. అతడి తెలుగు కూడా పెద్ద మైనస్ గా మారింది. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Aditya om Bigg Boss8

రోజు రోజుకి ఆదిత్య తనపై ట్రోల్స్ పెంచుకుంటున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో ఆదిత్య బిహేవియర్ అందరికీ షాక్ ఇచ్చింది. పృథ్వీరాజ్ తో కలసి వింతగా బిహేవ్ చేశాడు. ఇద్దరూ లవర్స్ అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ దగ్గరగా కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

Also Read: అక్కినేని ఫ్యామిలీలో 'నాగ' అనే పదంతో పేర్లు ఎందుకు ఉంటాయో తెలుసా.. పెద్ద ఫ్లాష్ బ్యాక్

ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది బ్రో అని పృథ్వీరాజ్ అంటాడు. వచ్చింది కదా అని ఆదిత్య సమాధానం ఇస్తూ.. ఐ లైక్ యూ అంటూ ఆదిత్య క్రేజీగా చెబుతాడు. ఇద్దరూ ఒకరి ముఖాలన్ని ఒకరు తడుముకోవడం.. క్రేజీగా చూసుకోవడం చాలా వింతగా ఉంది. 

టాప్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సిన ఆదిత్య ఓం ఇలా నవ్వుల పాలయ్యేలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అంటూ అంతా షాక్ అవుతున్నారు. చివరికి ఇంటి సభ్యులు కూడా ఆదిత్య, పృథ్వీ బిహేవియర్ పై జోకులు వేసుకుంటున్నారు. నిఖిల్, ప్రేరణ, అభయ్ ఒకదగ్గర కూర్చుని ఆదిత్య, పృథ్వీ బిహేవియర్ గురించి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. 

Latest Videos

click me!