సంజనా గల్రానీ సీక్రెట్‌ మ్యారేజ్‌.. కారణం చెప్పిన `సర్దార్‌ గబ్బర్‌సింగ్‌` బ్యూటీ

First Published Jun 5, 2021, 4:49 PM IST

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌ సంజనా గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారడంతో సంజల వివరణ ఇచ్చింది. తాను ఎందుకు సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది. 

కన్నడలో హీరోయిన్‌గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజన గతేడాది లాక్‌డౌన్‌ టైమ్‌లోనే వివాహం చేసుకుందట.తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. కర్నాటకకి చెందిన డాక్టర్‌ పాషాని ఆమె మ్యారేజ్‌ చేసుకుంది.
undefined
అయితే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆమె బెయిల్‌ పై విడుదలైన తర్వాత రహస్యంగా ఈ మ్యారేజ్‌ చేసుకుందట. దీనిపై సంజన వివరణ ఇస్తూ, మ్యారేజ్‌ ఫిక్స్ అయిన తర్వతే డ్రగ్స్ కేసులో ఆరోపణలు వచ్చినట్టు తెలిపింది.
undefined
`మ్యారేజ్‌ ఫిక్స్ అయిన వెంటనే డ్రగ్స్ కేసులో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇది పెద్ద ఇష్యూ అయ్యింది. నా పెళ్లి విషయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారితో పంచుకోలేకపోయాను. కానీ అందరిని ఆహ్వానించి రిసెప్షన్‌ గ్రాండ్‌గా చేసుకోవాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్‌ వల్ల అది కూడా సాధ్యం కాలేదు` అని తెలిపింది.
undefined
కన్నడనాట డ్రగ్స్ రాకెట్‌ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. సంజనా గల్రానీతోపాటు రాగిణి ద్వివేదిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిని అరెస్ట్ చేశారు. దాదాపు మూడు నెలలు జైల్లో ఉన్న సంజనా బెయిల్‌ పై బయకు వచ్చింది. కానీ డ్రగ్స్ కేసులో సంజన ఇరుక్కుందనే విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెకి సినిమా అవకాశాలు కూడా పోయినట్టు ప్రచారం జరిగింది.
undefined
ప్రస్తుతం సంజనా చేతిలో ఓ తమిళ సినిమా, ఓ మలయాళ చిత్రం ఉంది.ఇవి విడుదలకు రెడీ అవుతున్నాయి.
undefined
ఇదిలా ఉంటే సంజన తెలుగులోనూ పలు సినిమాలతో మెప్పించింది. ప్రభాస్‌ సరసన `బుజ్జిగాడు` చిత్రంలో నటించింది.
undefined
దీంతోపాటు `సత్యమేవ జయతే`, `అవును2`, `సర్దార్‌ గబ్బర్ సింగ్‌` వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది.
undefined
ఇటీవల తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కన్నడ చిత్ర పరిశ్రమకే పరిమితమైంది.
undefined
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు సంజన గల్రాని తన ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆహారం, సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసింది.
undefined
click me!