Intinti Gruhalakshmi: సామ్రాట్ ని నిలదీసిన హాని తాతయ్య.. తులసి పతనం చూసి లాస్య సంబరాలు!

First Published Oct 6, 2022, 10:16 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..తులసి సామ్రాట్ తో, బాస్ గా మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఎప్పుడైతే నేను తప్పు చేశాను అప్పుడే నాకు ఇది వదిలు వెళ్లాలి అనిపించింది. నందగోపాల్ గారికి మేనేజర్ అవ్వడానికి అని అర్హతలు ఉన్నాయి నేను ఆనందంగానే ఉన్నాను కంగ్రాట్స్ అని నందు కి చెప్తుంది తులసి. అప్పుడు లాస్య, నిజంగానే మాట్లాడుతున్నావ తులసి అని అనగా, నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి చెప్పను లాస్య. ఈ విషయం మీ అందరికీ తెలుసు అని అంటుంది తులసి.అప్పుడు లాస్య, తులసి చేసింది తప్పైనా సరే తనకి కూడా ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి సార్ అని లాస్య అనగా, వద్దు లాస్య నాకు ఈ పంజరంలో చిలకల ఉండడం ఇష్టం లేదు నేను స్వేచ్ఛగా ఉంటాను. నాకు ఉద్యోగం చేయడం నచ్చదు అని చెప్పి, ఇంక నేను బయలుదేరుతాను. 

మావయ్య పదండి అని చెప్పి కుటుంబంతో సహా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి.ఇంటికి వచ్చిన తర్వాత అనసూయ,అభి లు ఎంతో ఆనందంగా ఉంటారు కానీ మరోవైపు మిగిలిన కుటుంబ సభ్యులందరూ బాధగా ఉంటారు. అమ్మ నీకు బాధగా లేదా అని ప్రేమ్ అనగా,లేదు ప్రేమ్ నేను దేనికి ఆశించలేదు. ఇబ్బందిగానే ఉద్యోగం చేశాను ఇప్పుడు నా వల్ల తప్పు జరిగినప్పుడు నేను అక్కడ ఉంటే నాకు నచ్చదు కదా అని అనగా, మంచి మాట చెప్పావు తులసి. పదిమందికి సంగీతం నేర్పిస్తే ఆ డబ్బులతో ఇల్లు నడుస్తుంది ఏం పర్లేదు అని అనసూయ అంటుంది. ఆ తర్వాత హనీకి సామ్రాట్ భోజనం తినిపిస్తున్నప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తాడు. అప్పుడు సామ్రాట్ హనీ లోపలికి వెళ్లిపోమని చెప్పిన తర్వాత వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ని నిలదీసి, అసలు ఏం చేస్తున్నావురా తులసిని ఎందుకు వెళ్లగొట్టావు? కావాలనే ఇదంతా చేస్తున్నావ్ కదా అని అనగా, అనసూయతో జరిగిన విషయం అంత చెప్పాడు సామ్రాట్.

ఇలా వాళ్ళ కుటుంబంలో వాళ్లకి తులసి మాట పడడం ఇష్టం లేదు, అలాగే నాకు ఇష్టం లేదు.మొన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమతో అన్న మాటలను నేను ఇప్పటికీ మర్చిపోలేను. రేపు దివ్యకి అదే పరిస్థితి వస్తే ఏమవుతుంది.వాళ్ళ సంతోషం కోసం తులసి దృష్టిలో నేను చెడ్డవాడిగా మిగిలిపోయిన పర్వాలేదు అని అంటాడు సామ్రాట్. అప్పుడు వాళ్ళ బాబాయ్, ఆవిడ ఏదో చిన్న మనస్పర్ధ వల్ల అలా అని ఉండొచ్చు కదా దాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నా ఒక మాట అయినా అడగాలి కదా అని అనగా,లేదు బాబాయ్ బయటకు వెళ్తే నరాలు లేని నాలుకలు ఎంత మాటైనా అంటారు.వాళ్ళ వల్ల తులసి గారు బాధపడడం నాకు ఇష్టం లేదు ఇంక హనీ ని తులసి గారిని విడదీయడం జరగదు. హనీ తులసి గారు లేకుండా ఉండలేదు దాని గురించి ఆలోచిస్తున్నాను. నాకు తులసి గారు స్నేహితురాలుగా కాదు, అలాగని వ్యాపార భాగస్వామ్యంలో కూడా కాదు, 

అంతకన్నా ఇంకేదో అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు తులసి ఇంట్లో అందరూ మౌనంగా ఉంటారు. అప్పుడు తులసి,ఏమైంది ఇప్పుడు బానే ఉన్నది కదా ఇప్పుడు నాకేం లోటు వచ్చిందని అని అనగా అభి, అర్హత లేనప్పుడు మేనేజర్ పోస్ట్ ఇచ్చినప్పుడే నేను అర్థం చేసుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని.కానీ ఇంత త్వరగా అవుతుందని నేను అనుకోలేదు. అయినా అమ్మ తప్పు చేసింది అని అందరి ముందు నిలదీయడం ఎందుకు కళ్ళముందే అమ్మ ని ఉద్యోగం నుంచి పీకేసారు కదా అని అనగా, మనకేమీ జరగలేదు అభి.అంతా మన మంచికే జరిగింది ఇప్పుడు నేను ఏ నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా నా పని నేను చేసుకోవచ్చు అని అనగా పరంధామయ్య, నాకు తెలిసి సామ్రాట్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేదు.ఎవరో బలవంతంగా చేయించినట్టున్నారు అని అంటాడు. దానికి అనసూయ భయపడుతుంది.

అప్పుడు శృతి,సామ్రాట్ గారిని ఎదిరించే ధైర్యం ఎవరికి ఉంటుంది తాతయ్య. ఆయన చిన్న పిల్లాడు కాదు కదా అని అనగా, ఈ విషయం సామ్రాట్ గారే చెప్పాలి అని పరంధామయ్య అంటాడు. అప్పుడు తులసి,ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి రేపటి నుంచి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి అని వెళ్ళిపోతుంది. అప్పుడు అనసూయ, హమ్మయ్య గొడవ జరుగుతుంది అనుకున్నాను ఏమీ అవలేదు ఇలాగే ఉంటే బాగుండు అని అనుకుంటుంది.
 

ఆ తర్వాత రోజు సామ్రాట్ ఆఫీస్ కి రెడీ అయి కిందకు వచ్చి వాళ్ళ బాబాయ్ తో,తులసి నీ రెడీ అవ్వమని చెప్పండి అని అనగా, మనసు మార్చుకున్నావా తులసిని మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకుంటున్నావా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు. అప్పుడు సామ్రాన్ మర్చిపోయాను కదా అని అనుకోని లాస్య వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఇంక ప్రాజెక్టులతో బిజీగా ఉంటాను మీరు ఆ మ్యూజిక్స్ స్కూల్ గురించి చూసుకోండి అని అంటారు. దానికి లాస్య, అడుగుతున్నామని తప్పుగా అనుకోవద్దు కాని తులసిని తీసేసినప్పుడు ఈ ప్రాజెక్టు ఇంకెందుకు అని వాళ్ళు అడుగుతారు.
 

దానికి సామ్రాట్,నేను ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకుంటే అది పూర్తయ్యే వరకు వదలను. అది ఎలాగైనా పూర్తి చేయాలి లేకపోతే నా రేపిటేషన్ ఏమి అవ్వాలి చేయండి.వీలైతే తులసి గారి సహాయం తీసుకోండి అని అనగా తులసి ఉద్యోగం మానేసింది కద సార్ అని లాస్య అంటుంది. అప్పుడు సామ్రాట్,సరే అయితే మ్యూజిక్ క్లాస్ గురించి పూర్తిగా నువ్వు, నందు చూసుకోండి నా దగ్గరకి కూడా రావాల్సిన అవసరం లేదు అని ఫోన్ పెట్టేస్తాడు సామ్రాట్. అప్పుడు లాస్య నందుతో, ఈ మాటలు మనసులో నుంచి వచ్చినవి కాదు నందు ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనగా, వాళ్ల గురించి మనకు ఎందుకు లాస్య.
 

ఇంక మన పని మనం చేసుకుందాము.తులసి ఏమైపోతే మనకెందుకు అని అంటాడు. మరోవైపు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో, నువ్వు తప్పు చేశావు. అది నీ మనసుకు కూడా నచ్చడం లేదు కనీసం తులసి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగావా? కనీసం ఒక మాటైనా మాట్లాడావా అని అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!