కడుపు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

Published : May 13, 2024, 10:01 AM IST

తప్పుడు ఆహారాలను తినడం వల్లే చాలా సార్లు కడుపు నొప్పి వస్తుంటుంది. కానీ కడుపు నొప్పిని తగ్గించుకోవడానికి హాస్పటల్ కు వెళ్లడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉంటారు. అయితే ఇంటి దగ్గరే కొన్ని చిట్కాలతో ఈ కడుపు నొప్పిని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
కడుపు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
stomach pain

కొంతమందికి తరచుగా కడుపు నొప్పి వస్తుంటుంది. అజీర్ణం వల్ల కూడా కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి వారికి చింతపండు ప్రయోజరకరంగా ఉంటుంది. అవును చింతపండుతో చెడు ఆహారాలను తినడం వల్ల వచ్చే కడుపు నొప్పిని చాలా ఫాస్ట్ గా తగ్గించుకోవచ్చు. చింతపండు సహాయంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. 

25
stomach pain

కడుపునొప్పి తగ్గడానికి చింతపండు మిశ్రమాన్ని ఎలా తయారుచేయాలి? 

చింతపండు పొడి - 1 టీస్పూన్
తేనె - 1 టీస్పూన్
రాతి ఉప్పు - చిటికెడు
 

35

రెసిపి 1
కడుపు నొప్పి తగ్గడానికి చింతపండు పొడి, తేనె, రాతి ఉప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసి కలపండి. దీనిని వాడటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే కడుపు నొప్పి తొందరగా తగ్గిపోతుంది. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.

45


గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ మిశ్రమం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు రాతి ఉప్పుకు బదులుగా పటిక బెల్లాన్ని జోడించాలి. చింతపండు కడుపు నొప్పిని మాత్రమే కాకుండా డయేరియా సమస్యను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

55

రెసిపి 2

 2 టీస్పూన్ల చింతపండు పొడిని తీసుకుని అందులో చిటికెడు నల్ల మిరియాల పొడిని కలపండి. ఇప్పుడు ఈ రెండింటినీ 2 టీస్పూన్ల పాలలో వేసి దాని నుంచి మాత్రలు తయారుచేయండి. గోరువెచ్చని నీటితో ఒక టాబ్లెట్ ను వేసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. 

సూచన: ఏదైనా ప్రయత్నించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories