ఇంట్లో ఆడవాళ్లు ఏ వస్తువులను క్లీన్ చేయరో తెలుసా?

First Published | May 13, 2024, 10:46 AM IST

మీ ఇల్లు నీట్ గా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఇంట్లో మీరు శుభ్రం చేయని వస్తువులు ఎన్నో ఉంటాయి. ఇంటిని శుభ్రం చేయడం వల్ల శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అందుకే ఇంట్లో మీరు క్లీన్ చేయని వస్తువులను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

cleaning

వారమంతా మనం మన మన పనుల్లో బిజీగా ఉంటాం. దీనివల్ల ఇంటిని క్లీన్ చేయడం గురించి పెద్దగా పట్టించుకోం. కేవలం ఇంటిని ఊడవడం, తూడ్చినంత మాత్రాన అది క్లీన్ అయ్యిందని అనుకుంటే పొరపాటే. కానీ వారాంతాల్లో మాత్రం చేతులకు క్లీనింగ్ గ్లౌజులు వేసుకుని ఇంటిని అందంగా మార్చాలని బయలుదేరుతాం. బెడ్ షీట్లు, వాడిన దుస్తులను ఉతుక్కుంటాం. క్యాబినెట్లను శుభ్రం చేస్తాం. కానీ కొన్ని వస్తువులను మాత్రం క్లీన్ చేయాలన్న ఆలోచన కూడా మనకు రాదు. అలాంటి కొన్ని వస్తువులేంటో? వాటిని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

washing machine

వాషింగ్ మెషిన్

వాషింగ్ మెషీన్ ను సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు ఖచ్చితంగా శుభ్రం చేయడం అవసరం. కానీ చాలా మంది మెషిన్ ను వాసన వస్తుంటేనే క్లీన్ చేస్తుంటారు చాలా మంది. నిజానికి వాషింగ్ మెషీన్ ను శుభ్రం చేయడం చాలా సులభం. టాప్ లోడ్ మెషిన్ కోసం 450 గ్రాముల బోరాక్స్ ను నాలుగు లీటర్ల వెనిగర్ తో డ్రమ్ లో పోసి క్లీసి దాన్ని ఆన్ చేయండి.  అంతే.
 

Latest Videos


డిష్ వాషర్

కిచెన్ సామాగ్రిని శుభ్రం చేయడానికి డిష్ వాషర్ ను ఉపయోగిస్తారు. కానీ దీన్ని మాత్రం అస్సలు శుభ్రం చేయరు. కానీ వీటిని నెలకోసారైనా శుభ్రం చేయాలి. ఇందుకోసం ముందుగా ఫిల్టర్లు, ర్యాక్లు వంటి డిష్ వాషర్ అన్ని భాగాలను తొలగించండి. ఆ తర్వాత వాటిని సబ్బుతో బాగా కడగండి.

ఇయర్ బడ్స్

ప్రతి ఒక్కరూ ఇయర్ బడ్స్ ను వాడుతుంటారు. అది కూడా రెగ్యులర్ గా. కానీ వీటిని క్లీన్ చేయాలన్న ఆలోచన మాత్రం ఎవ్వరికీ రాదు. దీనివల్ల ఇయర్ బడ్స్ కు అక్కడక్కడ దుమ్ము, ధూళి పేరుకుపోయి మురికిగా కనిపిస్తాయి. అయినా అలాగే వాడుతుంటారు. అయితే చాలా మంది వీటిని క్లీన్ చేయరు అనుకుంటారు. కానీ వీటిని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. 
 

స్క్రీన్

ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్, ట్యాబ్ స్క్రీన్ లను ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. కానీ వాటిలో ఏ ఒక్క దాన్ని కూడా మనం క్లీన్ చేయం. కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల స్క్రీన్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి.  ల్యాప్ టాప్ స్క్రీన్ అయినా, టీవీ స్క్రీన్ అయినా ప్రతి వారం ఖచ్చితంగా క్లీన్ చేయాలి. 
 

కీ బోర్డు

కీబోర్డును మనం ప్రతిరోజూ ఉపయోగిస్తాం. అయినా క్లీన్ చేయకుండా పట్టించుకోని వాటిలో ఇవి ఒకటిగా ఉంటాయి. అవును చాలా మంది రెగ్యులర్ గా కీ బోర్డులను వాడినా వాటిని మాత్రం అస్సలు క్లీన్ చేయరు. కానీ వీటిని వారానికి ఒకసారైనా శుభ్రం చేయాలి. లేదంటే కీ బోర్డుకు దుమ్ము, ధూళి పట్టుకుని మురికిగా కనిస్తుంది. 

click me!