#Salaar కలెక్షన్స్ వివాదం,సొంత డబ్బులతో షోలు? ప్రభాస్ పరువు తీస్తున్నారే

First Published Jan 9, 2024, 12:45 PM IST

 ఈ కార్పోరేట్ బుక్కింగ్స్  సలార్ హిందీ నెంబర్స్ ని పెంచటానికే అంటున్నారు. అయితే టీమ్ అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేస్తోంది.


పెద్ద సినిమాల కలెక్షన్స్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని మోసుకు వస్తున్నాయి. యాంటి ఫ్యాన్స్ ఓ ప్రక్క హీరో ఫ్యాన్స్ ఓ ప్రక్క కొట్లాడుకుని ఈ వివాదాలను రాజేస్తూంటారు. అయితే మనకు ఇన్నాళ్లూ ఫేక్ కలెక్షన్స్ వింటూ వచ్చామే కానీ కార్పోరేట్ బుక్కింగ్స్ గురించి మాత్రం వినలేదు. కానీ “సలార్” మూవీకి కార్పొరేట్ బుకింగ్స్ చేశారంటూ బాలీవుడ్  మీడియాలో జరుగుతున్న వివాదం పెద్దదైంది. దాంతో  కొంతమంది నార్త్ వాళ్ళు కావాలని ఇలా చేసి ప్రభాస్ పరువు తీయాలని చూస్తున్నారా? అనే సందేహ పడ్డారు. 

ఇంతకీ ఈ కార్పొరేట్ బుకింగ్స్ వివాదం గోల ఏంటి? అంటే.. కార్పొరేట్ బుకింగ్ నార్త్ లో ఫేమస్. అవి ఏమిటంటే స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అనుకున్నంత హైప్ రాకపోవడం లేదా కనెక్షన్లు రానప్పుడు  ఆ సినిమాలో నటించిన హీరో లేదంటే నిర్మాణ సంస్థ కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసి మరీ సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తారు. దీంతో ఈ మూవీకి ఎక్కువ టికెట్స్ అమ్ముడు అవుతున్నాయి అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం మొదలవుతుంది. 

Latest Videos



అప్పుడు ఇలా ఫ్రీ టికెట్ తో సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియా ఖాతాలో సినిమా గురించి పాజిటివ్ గా రాస్తూ ప్రమోట్ చేస్త్తూంటారు. అలా వాళ్ల డబ్బులతో వాళ్లే  కార్పొరేట్ బుకింగ్స్ చేసి వాళ్ల సినిమాకు వాళ్లే హైప్ పెంచే ప్లాన్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా  ఫేక్ కలెక్షన్స్ . వీటినే  కార్పొరేట్ బుకింగ్స్ స్కాం అంటూంటారు. 


ఇక సలార్ విషయానికి వస్తే ... డిసెంబర్ 26వ తేదీ రాత్రి “సలార్” కార్పొరేట్ బుకింగ్స్ గురించి సోషల్ మీడియాలో దుమారం రేగింది. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్ లలో “సలార్” ఎర్లీ మార్నింగ్ షోలు ఫుల్ అయ్యి చూపించడం ఈ వివాదానికి దారి తీసింది. ఐనాక్స్ వంటి కొన్ని నేషనల్ ఫ్లెక్స్ చైన్లలో ఉదయం 6, 7 గంటల బుకింగ్స్ అన్ని ఫుల్ అయిపోయి కనిపించడంతో “సలార్” టీం కార్పొరేట్ బుకింగ్స్ చేస్తోంది అంటూ షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.


అయితే  సలార్ చిత్రం 600 కోట్లకు రీచ్ అవుతున్న ఈ సమయంలో ఈ కార్పోరేట్ బుక్సింగ్ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. హిందీ వెర్షన్ విషయంలో కాంట్రవర్శీ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం నేషనల్ ప్లెక్స్ లు కొన్ని మిడినైట్ షోలు సలార్ కు వర్కింగ్ డేస్ లో పడినట్లు చూపెట్టాయి. అయితే ఆ షోలు మామూలు ఆడియన్స్ కు అందుబాటులో లేవు. అవి అలా ఓపెన్ అయ్యాయి. ఇలా అమ్ముడుపోయాయి. ఇవి చూసిన  వారంతా ఈ కార్పోరేట్ బుక్కింగ్స్  సలార్ హిందీ నెంబర్స్ ని పెంచటానికే అంటున్నారు. అయితే టీమ్ అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేస్తోంది. డైరక్టర్ ప్రశాంత్ నీల్ కూడా వీటిని కొట్టిపారేసారు. అపోజీషన్ పీఆర్ ని టీమ్ బ్లేమ్ చేసింది. 
 


అయితే  బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో ఈ మిడ్ నైట్ షోల నెంబర్స్ కలిపే మూవీ కలెక్షన్స్ గా రిపోర్ట్ చేస్తున్నారు. దాంతో సలార్ టీమ్ ఇంటెన్షల్ గా ఈ హైప్ చేసిందని అంటున్నారు. అందుకు కారణం వారు చెప్పేదేమిటంటే..సలార్  సినిమా కలెక్షన్స్ రైజ్ చెయ్యటానికి వేరే సినిమా నిర్మాతలు ఖర్చు పెట్టాల్సిన పనేముంది అంటున్నారు. ఇక కార్పోరేట్ బుక్కింగ్స్ బాలీవుడ్ లో కామన్ అని. 
 


సాధారణంగా సినిమా ఫైనల్ కలెక్షన్స్ లో 10 – 20% శాతం ఎప్పుడూ ఉంటాయని, అయితే సలార్ ఆ లిమిట్ దాటిందని బ్లేమ్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఏదైమైనా ప్రబాస్ పరువు తీయటానికి నార్త్ లో ఆయన క్రేజ్ తగ్గించటానికి జరుగుతున్న కుట్ర అని ఫ్యాన్స్ దీన్ని అభివర్ణిస్తున్నారు. 

  నార్త్ పిఆర్ టీం హస్తమే దీని వెనకాల ఉంది అని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ స్కామ్ ఓన్లీ బాలీవుడ్ మాఫియా హ్యాండిల్ చేసే ఐనాక్స్ థియేటర్లలో మాత్రమే జరుగుతోంది అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఏదైతేనేం ఈ కాంట్రవర్సీపై “సలార్” మేకర్స్ స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. అయితే ఫస్ట్ వీకెండ్ అవ్వగానే కొన్నిచోట్ల కలెక్షన్స్ డ్రాప్ స్టార్టైంది. అయితే సెకండ్ వీకెండ్ లో జనాలకు డెవిల్, బబుల్ గమ్ సినిమాలు తప్పించి ఆప్షన్ లేకపోవటంతో మళ్లీ సలార్ కు కలెక్షన్స్ పోటెత్తాయి. చాలా చోట్ల సలార్ హౌస్ ఫుల్స్ పడ్డాయి. సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా ఈ ప్రవాహం నడుస్తోంది.


ఏదైమైనా  #Salaar తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే రూ.178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వీకెండ్ పూర్తి కాకముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  కొద్దిగా డ్రాప్ అయ్యినా , ఈ వీక్ లో డెవిల్ తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేకపోవటంతో ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 

Salaar Telugu crosses 100 crore at overseas Prabhas Prithviraj starrer box office report


‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం.  దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి?అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్ కు జనం వెళ్తున్నారు..  

click me!