ఫస్ట్ డే.. చాలా నర్వస్‌గా ఉందన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` భామ అలియాభట్‌.. ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అంటోన్న షారూఖ్‌

First Published Jul 3, 2021, 9:35 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌ ఫస్ట్ టైమ్‌లో షూటింగ్‌లో పాల్గొనాలంటే టెన్షన్‌గా ఉందట. చాలా నర్వస్‌గా ఉందంటూ ఏకంగా సోషల్‌ మీడియాలోనే పోస్ట్ పెట్టింది. అయితే షారూఖ్‌ ఖాన్‌ మాత్రం ఆమెని ఛాన్స్‌ అడగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` భామ అలియా భట్‌ ఫస్ట్ టైమ్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది. తనసొంత ప్రొడక్షన్‌లో ఏకంగా `డార్లింగ్స్` పేరుతో ఓ సినిమాని కూడా స్టార్ట్ చేసింది.
undefined
ఇందులో విజయ్‌ వర్మ, షెఫాలి షా, రోషన్‌ మాథ్యూలతో కలిసి నటిస్తుంది. జస్మీత్‌ కే రీన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గౌరీ ఖాన్‌తో కలిసి ఈ సినిమాని అలియా నిర్మిస్తుంది.
undefined
తనసొంత ప్రొడక్షన్‌లో, తాను ఒక లీడ్‌ రోల్‌ చేయడం చాలా వరకు ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. కానీ అలియాభట్‌కి మాత్రం చాలా నర్వస్‌గా ఉందట. చాలా టెన్షన్‌ పడుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది అలియా భట్‌.
undefined
`డార్లింగ్స్` చిత్రంలో మొదటి రోజు. నిర్మాతగా నా మొదటి సినిమా. ఫస్ట్ ఏదైనా నేను నర్వస్‌ అవుతాను. ఇప్పుడు అదే ఫీలింగ్‌ ఉంది. ఇదేంటో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రాత్రి నేను చాలా ఆందోళనకు గురయ్యాను. నా శరీరమంతా జలదరింపు ని పొందింది. రాత్రంతా ఆ కలలు కంటూనే ఉన్నాను.
undefined
గందరగోళం, ఆందోళన మధ్య ఎక్కడ లేట్‌ అవుతుందేమో అని, 15 నిమిషాల ముందే సెట్‌కి చేరుకున్నాను. కానీ ఈ ఫీలింగ్‌ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అంత నర్వస్‌గా ఫీలయ్యాను. నా హార్ట్ బీట్‌ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి` అని పేర్కొంది అలియా భట్‌.
undefined
ఈసందర్భంగా తాను మేకప్‌ రూమ్‌లో ప్రిపేర్‌ అవుతున్న ఫోటోలను, ఆందోళనలో ఉన్నపిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది అలియా.
undefined
ఈ సందర్బంగా సినీ ప్రముఖులు, అభిమానులు అలియాకి అభినందనలు తెలియజేస్తున్నారు. నటిగా సక్సెస్‌ సాధించినట్టే ప్రొడక్షన్‌లోనూ సక్సెస్‌ కావాలని విష్‌ చేస్తున్నారు. అయితే తన ప్రొడక్షన్‌కి ఏం పేరు పెట్టిందనేది క్లారిటీ ఇవ్వలేదు అలియా.
undefined
ఇదిలా ఉంటే అలియాభట్‌కి బెస్ట్ విషెస్‌ తెలియజేస్తూ షారూఖ్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఆయన తాను టైమ్‌కి షూటింగ్‌కి వస్తానని, చిన్నపాత్ర ఛాన్స్ ఇమ్మని అడగడం ఆసక్తికరంగా మారింది.
undefined
`ఈ సినిమా తర్వాత నాకు నెక్ట్స్ హోమ్‌ ప్రొడక్షన్‌లో చిన్న పాత్ర ఇవ్వండి. నేను షూట్‌కి సమయానికి వస్తాను. చాలా ప్రొఫేషనల్‌గాఉంటాను. అందుకు ప్రామిస్‌ చేస్తున్నా` అని షారూఖ్‌ ఫన్సీ కామెంట్‌ చేశాడు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్‌ ని తెగ ఆకట్టుకుంటుంది.
undefined
అలియాభట్‌ ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో సీత పాత్రలో రామ్‌చరణ్‌ సరసన నటిస్తుంది.
undefined
దీంతోపాటు హిందీలో `బ్రహ్మాస్త్ర`, `గంగూబాయ్‌ కథియవాడి` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
click me!