ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రోహిత్ టాప్ 5 గా నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో రేపు తేలనుంది. ఫినాలేకి ముందు శనివారం రోజు హౌస్ మేట్స్ హౌస్ లో ఎంతో సంతోషంగా గడిపారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి ప్రవేశించి ఎంటర్టైన్ చేశారు.