ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి భోజనం తీసుకుని రావడంతో జగతిని చూసి వసుధార అనుకొని ఎందుకు వచ్చావు వసుధార అనగా రిషి నేను జగతిని అని అంటుంది జగతి. రిషి భోజనం చేయలేదు కదా అనగా మేడం వసుధార మళ్లీ కాలేజీకి ఎందుకు వచ్చింది నన్ను బాధ పెట్టడానికే కదా అని అంటాడు. రిషి ఏం జరిగిందో మొత్తం అంతా నీకు తెలుసు బాధ అనగా బాధ కాదు మేడం మోసమా, ద్రోహమో ఇంకా ఏదైనా పెద్ద పదం వాడాలి అనుకుంటాను అంటాడు రిషి. తను ఎందుకు ఇలా చేసిందో మీకు ఏమైనా తెలుసా మేడం అని అంటాడు రిషి. పెళ్లి చేసుకుని అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చింది మీకు ఏమైనా తెలిసి.