హైపర్‌ ఆదిని తొక్కేసేందుకు కుట్ర.. మనసులో మాట బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్‌.. ఆ ఛాన్స్ కోసం ఇన్నాళ్లు..

Published : May 01, 2024, 12:15 PM IST

స్టార్‌ కమెడియన్‌ హైపర్‌ ఆదిపై ఓ జబర్దస్త్ కమెడియన్‌ కుట్ర చేస్తున్నాడు. తొక్కేసేందుకు పెద్ద ప్లానే వేశాడు. ఆ టైమ్‌ రావడంతో తన నిజస్వరూపం బయటపెట్టాడు.   

PREV
17
హైపర్‌ ఆదిని తొక్కేసేందుకు కుట్ర.. మనసులో మాట బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్‌.. ఆ ఛాన్స్ కోసం ఇన్నాళ్లు..

హైపర్‌ ఆది జబర్దస్త్ కమెడియన్‌గా ఎదిగాడు. స్టార్‌ కమెడియన్‌గా మారిపోయి ఇప్పుడు ఏకంగా `జబ్దర్దస్త్` షోనే వదిలేశాడు. అయితే జబర్దస్త్ లో ఏ ఇతర కమెడియన్లకి సాధ్యం కానంత రేంజ్‌కి ఎదిగాడు హైపర్‌ ఆది. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. 
 

27
sridevi drama company promo

చాలా మంది కమెడియన్ల తర్వాత వచ్చాడు హైపర్‌ ఆది. చాలా మందిని దాటుకుని ముందుకు వెళ్లాడు. తనకంటే ముందు వచ్చిన వారిని వెనక్కి నెట్టి నెక్ట్స్ లెవల్‌కి ఎదిగాడు. ఈ క్రమంలో కొంత మందిలో అసూయ ఉంటుంది. ఎలాగైనా తొక్కేయాలనే ఆలోచన వస్తుంది. మనకంటే ముందు వెళ్తుంటే ఓర్వలేని తనం ఉంటుంది. అయితే ఓ కమెడియన్‌కి అలాంటి ఆలోచనే ఉందట. 
 

37
sridevi drama company promo

హైపర్‌ ఆదిని తొక్కేసేందుకు ఓ జబర్దస్త్ కమెడియన్‌ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారట. ఆ విషయం ఎట్టకేలకు బయటపెట్టాడు. ఆ ఛాన్స్ కోసం వెయిట్‌ చేస్తున్నాడట. ఆ అవకాశం రావడంతో తాన కసి తీర్చుకున్నాడు. షోలోనే అందరి ముందు తన అసలు రూపం బయటపెట్టాడు. తన కసి తీర్చుకున్నాడు. మరి ఇంతకి హైపర్‌ ఆదిపై అసూయ ఉన్నది ఎవరికి, ఎవరు తొక్కేయాలనుకున్నారనేది చూస్తే.. 
 

47
sridevi drama company promo

అది ఎవరో కాదు చోటా కమెడియన్‌ నరేష్‌. జబర్దస్త్ నరేష్‌ చాలా ఏళ్లుగా హాస్యనటుడిగా రాణిస్తున్నారు. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. అందరిలాగే తాను జబర్దస్త్ లో స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. చిన్నగా ఉండటంతో అందరూ అతన్ని ప్రేమిస్తారు. తమ్ముడిలా భావించి ఎంకరేజ్‌ చేస్తారు. తను కూడా అందరితోనూ అంతే ఫ్రెండ్లీగా, ప్రేమగా ఉంటూ అందరి సపోర్ట్ తో మంచి కమెడియన్‌గా ఎదిగాడు. ఇప్పటికే జబర్దస్త్‌ షోలో నవ్వులు పూయిస్తున్నాడు. 
 

57
sridevi drama company promo

నరేష్‌ని.. హైపర్‌ ఆది సైతం బాగా ఎంకరేజ్‌ చేస్తాడు. ఇద్దరి మధ్య కన్వర్జేషన్‌ నవ్వులే నవ్వులు అనేలా ఉంటుంది. నరేష్‌ గురించి చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పాడు ఆది. అతను ఎదిగిన తీరుని వివరిస్తూ ఇన్‌ స్పైరింగ్‌ వర్డ్స్ వెల్లడించాడు. అలాంటిది హైపర్‌ ఆదినే నరేష్‌ తొక్కేయాలనుకున్నాడట. ఆ అవకాశం రావడంతో తన కసి తీర్చుకున్నాడట. 
 

67
sridevi drama company promo

అయితే ఇదంతా `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో. ఇందులో `బాహుబలి`లో ప్రభాస్‌ పైనుంచి రాజమాత నడుచుకుంటూ వెళ్లిన సీన్‌ బాగా హైలైట్‌ అయ్యింది. ఆ సీన్‌ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టారు. కామెడీగా దాన్ని ప్రదర్శించారు. అందులో భాగంగా హైపర్‌ ఆది పై నుంచి నరేష్‌ నడుచుకుంటూ వెళ్తాడు. అయితే వెళ్తూ వెళ్తూ మధ్యలో మెడపై కాలేసి తొక్కుతూ కాసేపు ఊపాడు. 
 

77

దీంతో ఆది కింద పడిపోయాడు. నరేష్‌ కూడా కిందకి దూకాడు. దీంతో `ఒక్క కాలు దానిపై(టేబుల్‌) పెట్టావు, మరో కాలు నాపై పెట్టి ఎందుకురా తొక్కుతున్నావ్‌ అని అడిగాడు ఆది. దీనికి స్పందిస్తూ ఎప్పటికైనా నిన్ను తొక్కాలనేది నా ఆశ` అని నరేష్‌ చెప్పడం నవ్వులు పూయించింది. కామెడీగా ప్రదర్శించిన ఈ సంఘటన ఆద్యంతం నవ్వులు పూయించింది. ఆది కూడా నవ్వుతూ దాన్ని లైట్‌ తీసుకున్నారు. ఇలాంటి షోస్‌లో ఇవన్నీ కామెడీ కోసమే ప్రదర్శిస్తారనేది అందరికి తెలిసిందే. కమెడియన్లు అందరు దాన్ని ఫన్‌ వేలోనే తీసుకుంటారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories