Guppedantha Manasu: రాజీవ్ వసు భర్త కాదని తెలుసుకున్న రిషి.. రాజీవ్ ని పోలీసులకు పట్టించిన రిషి?

First Published Feb 3, 2023, 8:19 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 3 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రాజీవ్ జగతి వాళ్ళని బాగున్నారు సార్ బాగున్నారా మేడం? మీరు బాగుంటారులేండి ఎందుకంటే మీరు మంచివారు అంటూ ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మా వసు అదే నా భార్య కనిపించడం లేదు ఏంటి అనడంతో ఏంటి మహేంద్ర అతను ఇక్కడికి వచ్చాడు అని అనగా నాకు అర్థం కావడం లేదు జగతి అంటాడు మహేంద్ర. నన్ను క్షమించండి మీ మీటింగ్ డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను. మీ అందరికి నేను ఎవరో తెలియదు అనుకుంటాను వసుధార నా భార్య అనడంతో కాలేజీ ఫ్యాకల్టీ అందరూ షాక్ అవుతారు. కాన్ఫరెన్స్ కాల్ లోకి వచ్చి గొడవ పెడితే మీకే అలా ఉంటే మరి నాకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటాడు రాజీవ్.
 

 అప్పుడు జగతి ఇలా వచ్చి గొడవ చేయడం మంచిది కాదు మర్యాదగా బయటికి వెళ్ళండి అని అంటుంది. అప్పుడు జగతి మహేంద్ర ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాజీవ్ అక్కడే ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కాలేజీ స్టాప్ వస్తుందా ఇక్కడ ఉండదు అనడంతో థాంక్యూ మేడం అని రాజీవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు కాలేజీ తనదే అయినట్టు కాలేజీ మొత్తం వినిపించేలా వసు ఎక్కడ ఉన్నావు నీ రాజీవ్ వచ్చాడు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు రాజీవ్. అప్పుడు ఆ మాటలు విన్నా వసుధార బయటికి వస్తుండగా మహేంద్ర వాళ్ళు రాజీవ్ ని ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడు అక్కడికి కాలేజీ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఇక్కడ ఉన్నావా? ఎలా ఉన్నావు వసు అనడంతో ఎందుకు వచ్చావు అని వసు అనగా నీకోసం అనడంతో షాక్ అవుతుంది. 
 

ఇకనుంచి వెళ్తావా లేదా అనడంతో వెళ్ళిపో కాదు వసు ఇద్దరు కలిసి వెళ్దాము అనగా నేను రాను అంటుంది వసుధార. నేను నీతో ఎందుకు రావాలి అనడంతో అప్పుడు రాజీవ్ నవ్వుకుంటూ అందరూ విన్నారా నా పెళ్ళాం నాతో రమ్మంటే ఎందుకు అని ప్రశ్నిస్తోంది అంటాడు రాజీవ్. అప్పుడు వసుధార ఎంత చెప్పిన వినిపించుకోకుండా వసుధార చేయి పట్టుకుని రా వసు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఎంతమంది ఉన్నా కూడా రాజీవ్ వసుధార చేయి పట్టుకుని బలవంతంగా బయటికి లాక్కొని వెళ్తాడు. బయటికి వెళ్ళగానే బయట రిషి ఎదురుపడతాడు. నమస్తే రిషి సార్ బాగున్నారా అనగా ఏం జరుగుతోంది అనడంతో భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరుగుతుంది అంటాడు రాజీవ్. రమ్మంటే రానంటుంది అనడంతో నేను రానని చెబుతున్నాను కదా అంటుంది వసుధార.

ఏంటి వసుధార ఇది ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు ఇకనుంచి వెళ్ళిపోఅంటాడు రిషి. అప్పుడు రాజీవ్ బలవంతంగా పిలుస్తుండగా వసుధార వెళ్లి రిషి వెనకాల దాక్కుంటుంది. సార్ నేను రాను అని చెప్పండి సార్ అనగా వెళ్ళమని చెబుతున్నాను కదా అంటాడు రిషి. నేను వెళ్ళను సార్ అతనితో వెళ్లడం నాకు ఇష్టం లేదు ఎందుకు వెళ్ళవు అతన్ని భార్య అంటున్నాడు కదా అంటాడు రిషి. అప్పుడు రాజీవ్ మీరు జెంటిల్మెన్ సార్ అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు రిషి వసుధార మీద సీరియస్ అవుతూ ఏంటి మీ కాలేజీలో పంచాయితీ వెళ్తావా లేదా అనగా అప్పుడు వసుధార చెయ్యి పట్టుకోబోతుండగా రిషి రాజీవ్ చేయి పట్టుకోవడంతో ఏంటి సార్ ఈ ట్విస్టు అనడంతో ఈ ట్విస్ట్ ఇక్కడ కాదు అక్కడ అంటూ పోలీసుల దగ్గరికి పంపిస్తాడు రిషి.
 

పోలీసులను చూడడంతో రాజీవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు పోలీసు ఏరా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఏడిపిస్తావా నువ్వు వస్తావని తెలిసే మేము రిషి సార్ ని ఆపమని చెప్పాము. అమ్మాయి నీ పెళ్లామా అసలు నువ్వు ఆ తాలే కట్టలేదు కదరా అనడంతో రిషి, మహేంద్ర,జగతి షాక్ అవుతారు. కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్లండి అని చెప్పి పోలీస్ రిషి దగ్గరికి వెళ్లి చాలా థాంక్స్ సార్ నేను మిమ్మల్ని మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వసుధార కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాలేజీ ఫ్యాకల్టీ దేవయానికి ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరించడంతో దేవయాని షాక్ అవుతుంది.
 

ఆ తర్వాత వసుధార ఒకచోట కూర్చుని జరిగిన విషయాలు తలుచుకొని ఏడుస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు వసుధార వెళ్ళిపోతుండగా నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు అనడంతో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను సార్ ఈ తాళి నా ఇష్ట పూర్వకంగానే మెడలో పడింది అని అంటుంది. నీ మెడలో తాళి ఆ రాజీవ్ కట్టలేదు ఎవరిని మోసం చేస్తున్నారా అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటున్నాడు రిషి. అప్పుడు రిషి,వసుధార నాకు సమాధానం కావాలి అనగా వసుధార మాత్రం పొంతన లేకుండా ఏవేవో సమాధానం చెబుతూ ఉంటుంది. వసుధార సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుండగా సమాధానం కావాలి వసుధార అని గట్టిగా అడుగుతాడు రిషి.
 

కాలమే సమాధానం చెబుతుంది సార్ కాస్త ఆగండి అంటుంది వసుధార. ఎవరో నాకు తెలియాలి అనడంతో తెలుసుకోండి కనీసం ప్రయత్నం అయినా చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆ తర్వాత మహేంద్ర జగతి వసుధర గురించి ఆలోచిస్తూ మనం చాలా పొరపడ్డాము జగతి, రాజీవ్ వసుధార మెడలో తాళి కట్టకపోతే మరి వసుధార మెడలో తాళి ఎవరు కట్టారు అసలు ఇదేం తలనొప్పి జగతి అంటాడు మహేంద్ర. ఇంతలోనే కాలేజీ స్టాప్ అక్కడికి వచ్చి ఇంతకీ వసుధార అసలు మొగుడు ఎవరు అని మాట్లాడుతారు. అప్పుడు వాళ్ళు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా జగతి అవమానంతో తలదించుకుంటుంది. అప్పుడు కాలేజీ ఫ్యాకల్టీ మాటలకు జగతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు వసుకి బుద్ధి లేదు వీళ్ళ మాటలతో రిషికి మనశ్శాంతి లేకుండా చేసేలా ఉన్నారు అంటుంది జగతి.

click me!