సీనియర్‌ నటిపై వనితా విజయ్‌ కుమార్‌ ఆరోపణలు.. మైండ్‌ బ్లోయింగ్‌ కౌంటర్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

First Published Jul 4, 2021, 11:58 AM IST

వరుస పెళ్లిళ్లు, విడాకులతో వివాదాస్పద నటిగా మారిన వనితా విజయ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై నటి రమ్యకృష్ణ స్పందించింది. మరో మాట లేకుండా అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. ఒక్కమాటలో తేల్చి పడేసింది. 

సీనియర్స్ యాక్టర్స్ విజయ్‌, మంజుల తనయ వనితా విజయ్‌ కుమార్‌. నటుడు అరుణ్‌ విజయ్‌, నటి శ్రీదేవిలకు సిస్టర్‌. అయితే బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఈ బొద్దుగుమ్మ లవ్‌, మ్యారేజ్‌ విషయంలో వివాదాల్లో నిలుస్తుంది.
undefined
ఇప్పటి వరకు ముగ్గురుని వివాహం చేసుకుని విడాకులిచ్చింది వనితా. ప్రేమ విషయంలో తాను ప్రతి సారి మోసపోతున్నానంటూ వాపోయింది. ఇక పెళ్లి చేసుకోబోనని వెల్లడించింది. ఇప్పుడు క్రమంగా కెరీర్‌పై దృష్టి పెట్టిస్తుంది.
undefined
ఈ క్రమంలో అందివచ్చిన సినీ, టీవీ అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కించాలని భావిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆమె `బిగ్‌బాస్‌ జోడిగల్‌` పేరుతో తమిళంలోని ఓ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలో పాల్గొంటుంది.
undefined
ఉన్నట్టుండి ఈ షో నుంచి తప్పుకుంది వనితా విజయ్‌ కుమార్‌. అంతేకాదు కాస్టింగ్‌ కౌచ్‌, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసింది. ఈ మేరకు ఓ పెద్ద లెటర్‌ని పంచుకుంది. ఆయా కారణాలతో తాను షో నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపింది.
undefined
ఈ షోలో సీనియర్‌ నటి అంటే రమ్యకృష్ణనే. ఆమె షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. బహుశా వనితా రమ్యకృష్ణపైనే ఈ ఆరోపణలు చేసిందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై రమ్యకృష్ణ స్పందించింది.
undefined
ఓ టీవీ ఛానెల్‌లో ఆమె స్పందిస్తూ, షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెని అడిగి ఉంటే బాగుండేది. నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. దీనిపై నేనేమి స్పందించలేను` అని పేర్కొంది.
undefined
ఈ సందర్భంగా చివరి ఎపిసోడ్‌లో వనిత పర్‌ఫెర్మెన్స్ కి పది మార్క్ లకు గానూ ఒక్క మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ. మరోవైపు వనిత ఓ టీవీ సిరీస్‌తోపాటు మరో షోలో పాల్గొంటుంది.
undefined
దీంతోపాటు తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది వనిత.
undefined
click me!