Janaki Kalaganaledu: రామచంద్రని అసహ్యించుకుంటున్న జ్ఞానాంబ.. కన్నీళ్లు పెట్టుకున్న రామచంద్ర జానకి?

First Published Jan 2, 2023, 11:11 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 2వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈ రోజు ఎపిసోడ్ లో అప్పు ఇచ్చిన అతను ఒక కుటుంబంలో ఉన్న మీకే ఒకరిపై ఒకరికి నమ్మకాలు లేనప్పుడు బయట వాడిని 20 లక్షలు అప్పు ఇచ్చిన వాడిని నాకు ఎలా నమ్మకం ఉంటుంది. నేను ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి చెప్పండి అని అంటాడు. అప్పుడు 5 లక్షలు ఎలా అయితే ఇచ్చానో ఇప్పుడు 20లక్షలు కూడా అలాగే మిమ్మల్ని చూసి ఇచ్చాను. మాములుగా అయితే మీరు డబ్బులు ఎప్పుడు  ఇస్తారని అడగాలి కానీ మీ పరిస్థితులు మీ కుటుంబంలోని వాళ్లను చూసాక నాకు డబ్బులు ఇప్పుడే కావాలండి ఇప్పుడే తిరిగి ఇచ్చేయండి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు జ్ఞానాంబ భాస్కర్ రావు గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఇలా మాట్లాడటం కరెక్టేనా అనడంతో తప్పదమ్మా అని అంటాడు.
 

 ఇప్పుడు అడగడానికి మొహమాట పడితే రేపు పొద్దున నా కుటుంబం రోడ్డున పడుతుంది అని అంటాడు. అయినా మీ అబ్బాయి విష్ణుకి ఇచ్చిన 5 లక్షల వడ్డీనే ఇప్పటివరకు కట్టలేదు అనడంతో ఏంటిది విష్ణు అని జ్ఞానాంబ నిలదీయడంతో వెంటనే మల్లిక ఆ మాయదారి కరోనా వచ్చినప్పటి నుంచి సరిగ్గా వ్యాపారం లేదు. షాప్ రెంట్ సరిగ్గా కట్టలేకపోతున్నాం ఇంకా వడ్డీ ఏం కడతాము అని అంటుంది. మీ పరిస్థితిని మల్ల చూసుకొండి ఫస్ట్ నా డబ్బు సంగతి తేల్చండి అని అంటాడు భాస్కర రావు. అప్పుడు అదేంటి బాబాయ్ మూడు నెలలు గడువు అడిగాను కదా అనడంతో అది అప్పుడు రామా ఇప్పుడు కాదు కానీ అది కష్టం మీద కేవలం మూడు రోజులు గడువు ఇస్తున్నాను నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలి అని అంటాడు.
 

మూడు రోజుల్లో నా డబ్బులు మొత్తం కట్టి మీ ఇంటికి కాగితాలు తీసుకెళ్లండి లేదంటే ఇంటిని ఆక్రమిస్తాను అని అంటాడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు మల్లిక ఇల్లు ఎలా జప్తి చేస్తారు అనడంతో మీదేమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అది నాకు సంబంధం లేదు అని చెప్పి భాస్కరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లిక అవకాశం దొరికింది కదా అని కలిసుందాం కలిసి ఉందాం అని అన్నారు ఇప్పుడు ఉండడానికి ఇల్లే లేకుండా పోయింది అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి బావగారు అప్పు చేసింది మీరు మీరే అప్పు కట్టండి ఇంటి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని అంటుంది మల్లిక. ఆ తర్వాత విష్ణు జానకి దగ్గరికి వచ్చి నా మీద కోపంతో ఇంటికి ఈ గతి పట్టిన చేసావ్ చాలా సంతోషం వదిన.
 

అన్నయ్య చిన్న వదిన చెప్పిన మాటలు విన్నావు కదా ఇంటి జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పి జెస్సిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల్. ఆ తర్వాత బాధతో తన గదిలోకి వెళ్లిన రామచంద్ర జరిగిన విషయాలు తెలుసుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. నేను చేసింది తప్పో ఒప్పు అర్థం కావడం లేదు జానకి గారు అఖిల్ కోసం అప్పు చేసి మూడు నెలల్లో ఎలా అయినా డబ్బులు తిరిగి ఇవ్వాలని అనుకున్నాను కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని ఏడుస్తూ మాట్లాడుతాడు రామచంద్ర. అప్పుడు రామచంద్రుని జానకి ఓదారుస్తూ నా రామ గారు ఎప్పుడు తప్పు చేయరండి. కానీ ఇదంతా ఊహించి ఆరోజు నేను అత్తయ్య గారికి చెబుతాను అంటే మీరే నన్ను ఆపారు.
 

మీరు ఒక మాట అత్తయ్య గారికి చెప్పి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదు అని అంటుంది జానకి. మీరు దాచిన ఒక్క నిజం ఈరోజు మిమ్మల్ని అబద్ధం చేసింది అనడంతో ఆరోజు నాకు అమ్మకు చెప్పాలి అమ్మను ఒప్పించాలి అన్నంత సమయం నాకు లేదు జానకి గారు తమ్ముడు బాగుపడాలి అని ఇదంతా చేశాను అని ఏడుస్తూ మాట్లాడుతాడు రామచంద్ర. మరి అఖిల్ నీ గురించి ఒక్క క్షణమైన ఆలోచన చేస్తే స్థితిలో ఉన్నాడా, విష్ణు అఖిల్ అందరూ కలిసి మిమ్మల్ని దోషులను చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు రామచంద్ర జానకి ఇద్దరు జరిగిన విషయాలు తలచుకొని ఏడుస్తూ ఉంటారు. తర్వాత జెస్సి అఖిల్ ని నీకోసమే బావగారు అంత అప్పు చేస్తే నువ్వు అలా మాట్లాడడం కరెక్టేనా అని అడుగుతుంది. మరి అంత ఇన్నోసెంట్ గా ఉంటే కష్టం జెస్సి చిన్న వదిన అన్నట్టుగా నిజంగానే వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొని ఉంటారు.
 

అప్పుడు జెస్సి నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా అఖిల్ మాత్రం కోపడుతూ వాళ్ళని మరింత అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు జానకి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు అఖిల్. ఆ తర్వాత రామచంద్ర గోవిందరాజులు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. మన కష్టం ఏడిస్తే పోయేది కాదు ఓదారిస్తే తగ్గిపోయేది కాదు అని అంటాడు గోవిందరాజులు. అప్పుడు రామచంద్ర తమ్ముడు కోసం ఆలోచించి ఎవరికీ చెప్పకుండా తప్పు చేశాను నాన్న నన్ను క్షమించండి అని అంటాడు. ఇంతలోనే జ్ఞానాంబ అక్కడికి వచ్చి క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు రామచంద్ర అని అంటుంది. నువ్వు తప్పు చేశావో స్వార్థంగా ఆలోచించావు అన్న విషయం పక్కన పెడితే నిన్ను ఎంతగానో నమ్మిన ఈ తల్లిని మోసం చేశావు. నా రామా నిజం తప్ప అబద్ధం చప్పుడు అని అనుకున్నాను.
 

నీ భార్య ఇంట్లోకి అడిగి పెట్టిన మొదటి రోజే నువ్వు నా దగ్గర నిజం దాచావు అప్పటినుంచి నువ్వు చాలా నిజాలు దాచావు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు రామచంద్ర అని జానకిని కూడా అపార్థం చేసుకునే మాట్లాడుతుంది జ్ఞానాంబ. చదువుకున్న అమ్మాయి నీకు భార్యగా వస్తే ఇల్లు ముక్కలు అవుతుందని అనుకున్నాను. అయినా మీ భార్య విషయంలో నేను తగ్గాను అదే నేను చేసిన పెద్ద తప్పేమో అని అంటుంది. అప్పుడు జానకి మాట్లాడడానికి ప్రయత్నించగా నేను రామతో మాట్లాడుతున్నాను అని అంటుంది జ్ఞానాంబ. నిన్న కాక మొన్న వచ్చిన నీ భార్యపై ఉన్న నమ్మకం నామీద నీకు లేదా అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ అనుమానిస్తూ మాట్లాడడంతో రామచంద్ర బాధపడుతూ ఉంటాడు. గుడిలో పూజారి గారు అరిష్టం రాబోతుందంటే ఏదో అనుకున్నాను కానీ ఇలా నిరూపంలో వస్తుందని అనుకోలేదు అంటుంది జ్ఞానాంబ.

click me!