జరగండి పాట కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..? అయినా లాభం లేదుగా..?

First Published Mar 29, 2024, 1:11 PM IST

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది జరగండీ సాంగ్. గేమ్ ఛేంజర్ నుంచి ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈపాటకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కాని ఈ సాంగ్  షూటింగ్ కు మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..? 
 

రామ్ చరణ్ సినిమా  కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈసారి సాలిడ్ గా రావాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్ . సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇక ఈమూవీ కొన్ని కారణాలుతో లేట్ అవుతూ వచ్చింది. ఇక ఈసినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు ఫ్యాన్స్. 
 

ఇక వెరీ రీసెంట్..  రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్  సినిమా నుంచి “జరగండి” అనే పాటను విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దలేర్ మెహంది, సునిధి చౌహన్ పాడారు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ చేశారు.. 

అయితే ఈపాట అనుకున్నంత స్పందనను రాబట్టలేకపోయింది. ఈ పాటపై చాలాఎఫెట్ పెట్టారు టీమ్. సాంగ్ కోసం దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టి చిత్రీకరించామని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. నిర్మాతలు చెప్పినంత గొప్పగా ఈ పాట లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ అభిమానులు ఈ పాట ఆయన స్థాయికి తగ్గట్టు లేదని చెబుతున్నారు. 

నాటు నాటు పాట ద్వారా రామ్ చరణ్ తేజ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్నారు. అలాంటిది శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో ఇంతటి తక్కువ ప్రమాణాలతో పాట ఉందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతే కాదు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు., 

అయితే పాట కాపీ అయినా, ఆకట్టుకునేలా, వినసొంపుగా ఉందా అంటే లేదనే అంటున్నారు నెటిజన్లు. డీలా పడేలా చేస్తుందని పోస్ట్ లు చేస్తున్నారు. అంతేకాదు షణ్ముఖ్‌ సినిమాతో పోల్చడం ఇప్పుడు మరింత దారుణంగా మారింది. `జరగండి` పాటకి వ్యూస్‌ కూడా తక్కువగానే ఉన్నాయి. 24 గంటల్లో ఇది ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీలో దీనికి కేవలం 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే. 
 

click me!