బీరెడీ: ‘ఉప్పెన ‘ లా రాబోతున్న ‘రేడియో మాధవ్‌’

First Published Jan 16, 2021, 2:02 PM IST

తమిళ స్టార్‌ విజయ్ సేతపతి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ సేతుపతి సినిమా అంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. ఆ విషయం మనకు తాజాగా విజయ్‌ నటించిన 'మాస్టర్'‌ సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్‌లో క్రియేట్ అవటంలోనే అర్దమైంది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకు టాక్,రివ్యూలు తేడాగా వచ్చినా ఇప్పటికే సినిమా థియేటర్లలో కలెక్షన్స్ తో  రికార్డుల మోత మోగిస్తోంది. ఈ  రోజు ఆయన పుట్టిన రోజు. ఈయన హీరోగానే కాకుండా విలన్‌ గానూ విలక్షణ నటన ప్రదర్శిస్తూ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న విజయ్‌ సేతుపతి ప్రస్తుతం మామనిదన్, కడైశీ వివసాయి, యాదుం ఊరే యావరుం కెళీర్, లాభం, తుగ్లక్‌ దర్బార్‌ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. తెలుగులోనూ ఆయన నటించిన రేడియో మాధవ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. అలాగే ఉప్పెన సినిమా సైతం ఇప్పటికే క్రేజ్ క్రియేట్ చేసుకుని వచ్చే విడుదల కాబోతోంది.  ఈ రెండు సంస్దల నుంచి విజయ్ సేతుపతికి పుట్టిన రోజు విషెష్ తెలియచేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు.

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్‌’. జయరామ్‌ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్‌ కలతిల్‌ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్‌’ టైటిల్‌తో తెలుగులో అనువదించారు.
undefined
ఈ సినిమా విజయ్ సేతుపతి ..తన నిజ జీవిత పాత్రలో కనిపిస్తారు. అతను తన సినిమా ప్రమోషన్ నిమిత్తం కొచ్చిన్ వస్తాడు. రేడియో ఎఫ్ ఎమ్ లో ..నిజ జీవిత లవ్ స్టోరీ లు చెప్పిస్తూంటాడు. వాటిల్లో బెస్ట్ అనుకున్న వాటికి గిప్ట్ లు ఇస్తూంటారు. ఈ క్రమంలో విన్న జయరామ్, హీరోయిన్ లవ్ స్టోరీకు అడ్డంకులు తొలిగించి శుభం కార్డ్ వేసాడన్నది కథ.
undefined
గతంలో ఇదే నిర్మాతలు దుల్కర్‌ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశారు. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్‌’ని అందిస్తున్నారు. రేడియో స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది కృష్ణస్వామి. సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ.
undefined
Vijay Sethupathiఇక ఉప్పెన విషయానికి వస్తే...విజయ్‍ సేతుపతి కనికరం లేని విలన్‍గా కనిపిస్తాడట. తనని కాదని జాలరిని ప్రేమించిన కూతురికి గుణపాఠం చెప్పడానికి పీక్స్కి వెళ్లిపోయి హీరోను శిక్షిస్తాడని తెలుస్తోంది. తమిళంలో అంత పెద్ద హీరో అయి వుండీ చాలా క్రూరమైన విలన్‍గా నటించడానికి ఓకే చెప్పాడని గొప్పగా చెప్పుకుంటున్నారు.
undefined
ఇక మాస్టర్ సినిమాలో హీరో విజయ్ కంటే కూడా సేతపతినే హైలైట్‍ అయ్యాడు. ఒక రకంగా ఆ సినిమాను డిజాస్టర్‍ అయిపోకుండా విజయ్ సేతుపతి మాత్రమే కాపాడని కూడా చెప్పుకుంటున్నారు.
undefined
Vijay Sethupathi
undefined
click me!