ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి అయినప్పటికీ రచయితగా కొరటాల శివ పాత్ర ఎంతైనా ఉంది. అప్పటికి కొరటాల ఇంకా డైరెక్టర్ కాలేదు. కొరటాల శివ అందించిన కథ, మాటలు ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అయ్యాయి. కొరటాల శివ, బోయపాటి ఇద్దరూ పోసాని కృష్ణమురళి శిష్యులే. ఇప్పుడు వీళ్ళిద్దరూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు.