క్లైమాక్స్ లో రకుల్ తో శృంగార సన్నివేశం..నిర్మాత ఆమె జాతకం చూపించి ఏం చేశాడో తెలుసా ?

First Published Apr 15, 2024, 10:22 AM IST

నేను రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ నిర్మాత వదల్లేదు. మా నాన్నకి ఫోన్ చేశారు. ఆ నిర్మాత అంతలా నా వెంట పడడానికి కారణం ఉంది.

టాలీవుడ్ లో వెలుగు వెలిగిన నటీమణుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గ్లామర్ రోల్స్ తో యువతని ఒక ఊపు ఊపేసింది. టాలీవుడ్ లో ఆమె మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, నాగ చైతన్య, అల్లు అర్జున్, రవితేజ, సాయి ధరమ్ తేజ్ లాంటి స్టార్స్ తో నటించింది. విజయాలతో పాటు రకుల్ కి పరాజయాలు కూడా ఎదురయ్యాయి. ఏది ఏమైనా టాలీవుడ్ లో ఒక దశలో రకుల్ హైయెస్ట్ పైడ్ హీరోయిన్ గా ఎదిగింది. 

అయితే సినిమాల్లోకి తన ఎంట్రీ సినిమాటిక్ గానే జరిగిందట. రకుల్ ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా టాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేను కాలేజీ చదివేరోజుల్లో సౌత్ ఇండస్ట్రీ ఉందని కానీ, టాలీవుడ్ లాంటివి ఉన్నాయని కానీ ఏమి తెలియదు. మ్యాథమెటిక్స్ లో స్పెషలైజేషన్ చేయాలనేది నా కోరిక. సినిమాల గురించి ఏమి తెలియదు. 

నేను మోడలింగ్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు కన్నడ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో నా ఎంట్రీ గురించి చెబితే నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే మా కాలేజ్ లో కొందరు ఫ్రెండ్స్ చెప్పిన దానిప్రకారం సౌత్ సినిమాల్లో బూతు ఎక్కువగా ఉంటుందని అన్నారు. అయితే దాని గురించి నాకు క్లారిటీ లేదు. కన్నడ సినిమా కోసం నాకు కాల్ చేస్తే.. సౌత్ చిత్రాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. సారీ అంటూ రిజెక్ట్ చేశా. 

నేను రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ నిర్మాత వదల్లేదు. మా నాన్నకి ఫోన్ చేశారు. ఆ నిర్మాత అంతలా నా వెంట పడడానికి కారణం ఉంది. ఆయన నా పుట్టిన తేదీ తెలుసు. నా డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 10, 1990. ఆ నిర్మాత నా జాతకం చూపించారట. ఈమె షూర్ షాట్ గా స్టార్ హీరోయిన్ అవుతుంది అని జాతకంలో చెప్పారట. కాబట్టి ఆ నిర్మాత నన్ను వదల్లేదు. అప్పుడు నా వయసు కేవలం 18 ఏళ్ళు. నిర్మాత ఆ విషయాన్ని మా నాన్నకి చెప్పారు. 

మా నాన్న నన్ను అడిగితే నాకు నటనే రాదు.. నేను స్టార్ ఏంటి అని నవ్వుకున్నా. వాళ్ళు నాతో చేయాలనుకున్న చిత్రం 7 జి బృందావన కాలనీకి కన్నడ రీమేక్. ఒకసారి ఆ మూవీ చూడమని సీడీ పంపించారు. క్లైమాక్స్ లో ఆ శృంగార సన్నివేశం చూసి నాకు ఏడుపు వచ్చేసింది. నాన్న నేను ఈ సినిమా చేయను అంటూ ఏడ్చేశాను. దీనితో మా నాన్న నిర్మాతకి ఫోన్ చేసి మా అమ్మాయికి ఆ సీన్ కంఫర్టబుల్ గా లేదు. కాబట్టి ఈ మూవీ చేయలేదు అని చెప్పేశారు. 

అయినా ఆ నిర్మాత వదల్లేదు. నా జాతకంపై అంతగా ఆయనకి నమ్మకం. ఒకే పర్వాలేదు.. సినిమాలో ఆ సీన్ ఉండదు.. క్లైమాక్స్ మార్చేస్తాం అని చెప్పారు. దీనితో వెంటనే ఒకే చెప్పా. ఆ సినిమాకి 30 రోజులు షూటింగ్ లో పాల్గొన్నా. కొన్ని లక్షలు రెమ్యునరేషన్ గా ఇచ్చారు. ఆ డబ్బుతో కారు కొన్నట్లు రకుల్ తెలిపింది. 

ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కాల్స్ మొదలయ్యాయి. కెరటం చిత్రంలో చిన్న పాత్ర చేశాను. అదే సమయంలో పూరి జగన్నాధ్ నుంచి కాల్ వచ్చింది 100 రోజుల డేట్లు కావాలని అడిగారు. నా కాలేజ్ పోతుందని ఒప్పుకోలేదు. ఆ తర్వాత ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లో ఆఫర్ వచ్చి చేజారింది అని రకుల్ పేర్కొంది. 

click me!