గుడులు గోపురాలు కట్టిస్తున్న ఎన్టీఆర్... ఆలస్యంగా వెలుగులోకి షాకింగ్ పరిణామం!

By Sambi Reddy  |  First Published May 15, 2024, 5:31 PM IST


జూనియర్ ఎన్టీఆర్ గుప్తదానాలు చేస్తున్నారు. ఆయన గుడులు గోపురాలు కట్టిస్తున్నారు. ఓ ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో డొనేట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 


జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో  బిజీగా ఉన్నారు. హిందీలో  తన మొదటి డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఇప్పటికే ఒక  షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఇందులో స్పై ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. దీంతో పాటు దేవర షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే  ఎన్టీఆర్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై చూద్దామా  అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. తాజాగా తారక్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ మరోసారి తన  గొప్ప మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు. 

Latest Videos

ఈ విషయం ఓ ఫ్యాన్ ద్వారా వెలుగులోకి వచ్చింది.  ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం ఎన్టీఆర్ రూ. 12 లక్షల 50 వేలు రూపాయలు విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించి గుడి బయట శిలాఫలకంపై రాయించారు. 

అందులో ఎన్టీఆర్, భార్య లక్ష్మి ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు రాశారు. ఎన్టీఆర్ విరాళం ఇచ్చిన సంగతి ఆలయ నిర్మాణం పూర్తి అయినంత వరకు ఎవరికీ తెలియక పోవడం విశేషం.   ఈ విషయం హైలెట్  చేస్తూ  మంచి కనిపిస్తే చాలు మనిషి పేరు వినిపించకర్లేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో దేవర నుంచి కీలక అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 
 

click me!