చాలా మంది హీరోయిన్లు మోడలింగ్, ఫ్యాషన్ షోల నుంచి ఇండస్ట్రీకి వస్తుంటారు. మిస్ ఇండియా అయినా, మిస్ యూనివర్స్ అయినా.. ఆతరువాత హీరోయిన్ గా అవ్వాల్సిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలమంది హీరోయిన్లు అలా వచ్చినవారే. అదేవిధంగా, ఈ రోజు ప్రపంచ సుందరి కిరీటంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, భారతీయ సినిమాలో ప్రముఖ ముఖాల్లో ఒకరిగా ఉన్న హీరోయిన్ ఏ స్థాయిలో ఎదిగిందో చూద్దాం.
ఈ నటి బాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె మరెవరో కాదు, ప్రియాంక చోప్రా. బాలీవుడ్, హాలీవుడ్‌లో ఉత్తమ వెబ్ సిరీస్, సినిమాల్లో నటించిన ప్రియాంక, అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ రోజు, ఆమె తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టి మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.
Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?