Intinti Gruhalakshmi: తండ్రికి సేవలు చేస్తున్న నందు.. లాస్యకు బుద్ధి చెప్పిన అభి, ప్రేమ్?

First Published Dec 2, 2022, 10:46 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో నందు ఫ్యామిలీ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉండగా అది చూసిన లాస్య అందరూ ఒకటయ్యారు నన్ను దూరం పెడుతున్నారు ఎలా అయినా కొంచెం తగ్గి వీళ్ళందర్లో కలిసిపోవాలి అని అక్కడికి వెళ్లి ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ముఖం మార్చుకుంటారు. ఇలా కుటుంబం అందరూ కలిసి ఒక చోట మాట్లాడుకుని ఎంత కాలం అయిందో దిష్టి తగిలింది అందుకే చాలా కాలం తర్వాత మళ్లీ మాట్లాడుకుంటున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది లాస్య. ఇప్పుడు లాస్య అనసూయ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ అత్తయ్య హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది.
 

అత్తయ్య మీరు వేసుకోవాల్సిన ఉదయం టాబ్లెట్స్ మర్చిపోయారు నేను తీసుకు వస్తాను అని అనగా అవసరం లేదమ్మా నేను ఇచ్చాను అని అంటాడు పనుందామయ్య. జావా తీసుకొని వస్తాను అనగా వద్దమ్మా అంకిత ఇచ్చింది అని అంటాడు. కాళ్ళు నొక్కుతాను అని అనగా ఇప్పుడు వరకు శృతి నొక్కింది అని అంటాడు పరంధామయ్య. కావాలనే ఆడుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటుంది లాస్య. అప్పుడు లాస్య ఎంత ప్రేమగా మాట్లాడించినా అనసూయ దంపతులు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. తులసి ఫోన్ చేయడంతో అందరూ సంతోషంగా తులసితో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. అది చూడలేక లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

మరొకవైపు సామ్రాట్, కూతురితో కలసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి తులసి వచ్చి హనీ నీ ప్రేమగా ముద్దాడుతూ ఉంటున్నాను. ఎందుకు పిలిపించారు అని తులసి అడగగా మీరు మేనేజర్గా చేసిన తర్వాత మొదటి సాలరీ వచ్చింది ఇప్పటివరకు ఇవ్వలేదు మిమ్మల్ని మా ఇంట్లో మనిషిలాగ ట్రీట్ చేస్తున్నాను అందుకే అందరిలాగా మీకు అకౌంట్ కు వేయకుండా హనీ చేతులతో మీకు ఇద్దామని ఇక్కడికి పిలిపించాను అని అంటాడు సామ్రాట్. తర్వాత హనీ చేతుల మీదుగా సామ్రాట్ తులసికి చెక్ ఇస్తాడు. అప్పుడు ఈరోజు నాకు కొంచెం హ్యాపీగా ఉంది మీ ప్లాన్స్ ఏంటి అని సామ్రాట్ అడగగా ఏముంది ఇంట్లోకి కొంచెం సామాగ్రి కొనుక్కోవడం బడ్జెట్ తగ్గట్టుగా అన్ని సరి చూసుకోవడం అని అంటుంది తులసి.

 అప్పుడు గృహిణి బాధ్యతలను అంత ఈజీగా తీసి పడేయకండి చాలా కష్టం అని అంటుంది తులసి. అప్పుడు గృహిణి కష్టం కూడా తెలిస్తే ఎవరిది ఎలాంటి కష్టమో తెలిసిపోతుంది అని అంటుంది తులసి. మీరు ఒక పని చేయండి తులసి ప్లేస్ లో జీతం వచ్చిన మొదటి రోజు ఎలా ఉంటుందో నా ఫేస్ లో ఉండి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అని అంటుంది తులసి. సరే వెళ్దాం పదండి దారిలో డబ్బులు తీసుకొని మా ఇంటి దగ్గర నుంచి మీ ఛాలెంజ్ మొదలవుతుంది అని అంటుంది తులసి. మరొకవైపు నందుపరందామయ్యకు సేవలు చేస్తూ ఉంటాడు. అనసూయ నందు వాళ్లు నవ్వుకుంటూ ఉండగా ఇంతలోనే శృతి అంకిత అక్కడికి వచ్చి నెలకి కావాల్సిన సరుకులు లిస్టు తయారు చేశాము ఇంతకుముందు ఇవన్నీ చూసుకునేది ఆంటీ లేదు కదా అని అంటుంది ఆల్మోస్ట్ సరుకులు రాసేసాము అని అంటారు అంకిత శృతి.

అప్పుడు నందు ఆ పేపర్ తీసుకోబోతుండగా లాస్య వచ్చి ఆ పేపర్ లాక్కుంటుంది. తులసి తర్వాత ఇంటి కోడలు నేనే కాబట్టి ఇవన్నీ నేను చూసుకుంటాను నా తర్వాత ఇంటి కోడలు మీరు కాబట్టి మీరు చూసుకోవాలి మీకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి అని అంటుంది లాస్య. అప్పుడు అనసూయ నందుకు ఆ పేపర్ ఇస్తుండగా నువ్వు ఎందుకు తీసుకున్నావు అనడంతో నందు ఏం చేస్తారు అత్తయ్య ఫ్రేమ్ కట్టించుకుంటాడా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు డబ్బులు ఎక్కడివి అంటూ అందరి ముందు నందుని చిన్న చూపు చేసి మాట్లాడుతుంది లాస్య. లాస్య ఆ సరుకులు లిస్టు చూసి ఇన్ని రాయకూడదు మంది జీడిపప్పులు కాదు అంటూ మాట్లాడుతూ ఉండగా తులసి చేతిలో ఉన్న పేపర్ నీ అభి లాక్కుంటాడు.
 

ఏంటి పేపర్ లాక్కున్నారు అని అనడంతో మా నాన్న తర్వాత ఇంటి బాధ్యతలు మేమే చూడాలి కాబట్టి ఈ సరుకులు నేను తీసుకు వస్తాను అని అంటాడు అభి. అప్పుడు తులసి లేనప్పుడు బాధ్యతలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని అంటుంది లాస్య. అప్పుడు లాస్య నందుని నువ్వైనా పిల్లలకు నచ్చచెప్పు నందు ఆ సరుకులు లిస్టు నాకు ఇవ్వమని చెప్పు నేను తీసుకు వస్తాను అని అంటుంది. అప్పుడు ప్రేమ్ భాష మారినంత మాత్రాన నీ బుద్ధులు మారుతాయని ఇక్కడ ఎవరికీ నమ్మకాలు లేవు అని అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు నందు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇప్పుడు అభి బాధ్యతలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి కానీ బలవంతంగా కబ్జా చేయకూడదు నువ్వు చేస్తున్నది అదే అని అంటాడు. సంపాదన లేదు అంటూ మా నాన్న గురించి తక్కువగా చేసి మాట్లాడినప్పుడే నీ ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం అయింది అని అంటాడు. అప్పుడు ఏం మాట్లాడవేంటి నందు అనడంతో సరుకులు వాళ్ళనే తీసుకొని రానివ్వు లాస్య అని అంటాడు.

click me!