ఓ దర్శకుడి వింత పోకడలకు, వెర్రి చేష్టలు నిదర్శనం `రాంగ్‌గోపాల్‌ వర్మ`ః ప్రభు

First Published Oct 12, 2020, 7:13 PM IST

`ఓ దర్శకుడి వింత పోకడలను, వెర్రి చేష్టలకు విసిగిపోయి, వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో `రాంగ్‌గోపాల్‌ వర్మ` సినిమాని తెరకెక్కించానని అంటున్నారు దర్శక, నిర్మాత, సీనియర్‌ జర్నలిస్ట్ ప్రభు.

ప్రభు రూపొందించిన `రాంగ్‌ గోపాల్‌ వర్మ` చిత్రంలో షకలక శంకర్‌ హీరోగా నటించగా, జబర్దస్త్ అభి కీలక పాత్ర పోషించారు. ర్యాప్‌ రాక్‌ షకీల్‌ సంగీతం అందించారు. బాబుకెమెరామెన్‌గా పనిచేశారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌, టైటిల్‌ సాంగ్‌, టీజర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా సోమవారం ట్రైలర్‌ ని విడుదల చేశారు.
undefined
జర్నలిస్ట్ గా విశేష సేవలందించిన ప్రభు `రాంగ్‌ గోపాల్‌ వర్మ` చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ లు వినాయకరావు, సురేష్‌కొండేటిఅన్నారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో `రాంగ్ గోపాల్ వర్మ` ఒకటని షకలక శంకర్ అన్నారు.
undefined
ఈ సినిమాకి పనిచేసే అవకాశం కల్పించిన ప్రభుకి.. సంగీత దర్శకుడు షకీల్‌, కెమెరా బాబు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీపేరుపేరునా థాంక్స్ చెప్పిన ప్రభు.. ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. వివాదాస్పద దర్శకుడురామ్‌గోపాల్‌వర్మపై ఈ సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే.
undefined
click me!