ఆదిపురుష్ టీజర్ ఎలా ఉన్నా అది మాత్రం కేక.. ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్, కృతి సనన్ కెమిస్ట్రీ వైరల్..

First Published Oct 3, 2022, 6:34 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ విజువల్ వండర్ మూవీ 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ విజువల్ వండర్ మూవీ 'ఆదిపురుష్'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. ప్రేక్షకుల్ని, అభిమానులని టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 

అమరేంద్ర బాహుబలిగానే ప్రభాస్ మెప్పించాడు. అలాంటిది శ్రీరాముడి పాత్రలో ఇంకెలా నటిస్తాడో అని అంతా ఎదురుచూశారు. రామాయణం చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నాం అని అంతా సంబరపడ్డారు. డైరెక్టర్ ఓం రౌత్ ఆలోచనలు అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా లేవు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

టీజర్ లో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. ఇక రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ లుక్ అయితే దారుణంగా ఉంది. మన ఊహల్లో ఉండే రావణుడు వేరు.. ఓం రౌత్ చూపించిన రావణుడు వేరు. రాముడి వెంట వానర సైన్యం ఉంటుందని విన్నాం. కానీ అక్కడ అవతార్ తరహాలో ఏవేవో గ్రాఫిక్ విజువల్స్ లో కొత్త జంతువులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా టీజర్ తో ఆదిపురుష్ చిత్రంపై ట్రోలింగ్ మొదలైంది. దీనిని చిత్ర యూనిట్ ఎలా అధికమిస్తారో చూడాలి. 

కానీ ఒక విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. అదేంటంటే.. ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్, కృతి సనన్ మధ్య కెమిస్ట్రీ. టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్, కృతి ఇద్దరూ చూడముచ్చటగా కనిపించారు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరి మధ్య ఎంతో అందమైన సంభాషణ జరిగింది. 

ఆ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వేదికపై ప్రభాస్ కి చెమటలు పడుతుంటే.. కృతి తన దుపట్టా తీసుకో అని అడగడం.. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని వేదిక దిగడం చూడ ముచ్చటగా ఉంది. ఈ విజువల్స్ కి నెటిజన్లు వారికి ఇష్టమైన బిజియం వేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. 

వైట్ అండ్ వైట్ లో ప్రభాస్.. అందమైన లెహంగాలో కృతి సనన్ బ్యూటిఫుల్ గా ఉన్నారు. టీజర్ లో చూపిన విజువల్స్ పక్కన పెడితే సినిమాలో కూడా వీరి జంట ఆకట్టుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఆ మధ్యన ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. 

click me!