Poorna Stunning Looks: కవ్వించే చూపులతో కుర్రాళ్లో కల్లోలం సృష్టిస్తున్న `ఢీ` భామ.. జిగేల్‌ అందాలు

First Published Mar 13, 2022, 10:07 AM IST

పూర్ణ.. అందం, అభినయం మేళవించిన నటి. మంచి పాత్రలు పడితే తానేంటో నిరూపించుకోగలదు. `ఢీ` షోతో బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైన ఈ భామ హాట్‌ హాట్‌ ఫోటోలతో నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 
 

పూర్ణ(Poorna)గా తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సొంతం చేసుకున్న షమ్మా కసిమ్‌(Shamna Kasim) లేటెస్ట్ గ్లామర్‌ లుక్స్ తో కుర్రాళ్లని ఫిదా చేస్తుంది. జిగేల్‌ మనిపించే డ్రెస్‌లో హోయలు పోయింది. కవ్వించే చూపులతో కుర్రాళ్లోకల్లోలం సృష్టిస్తుందీ సెక్సీ అందాల భామ. లేటెస్ట్ హాట్‌ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తున్న పూర్ణ ఇటీవల `అఖండ` చిత్రంలోనూ కాస్త బోల్డ్ రోల్‌ చేసింది. డీసెంట్‌గా, క్లాసీగా కనిపించిన ఈ బ్యూటీ విలన్‌ పాత్ర అయిన శ్రీకాంత్‌తో రేప్‌ సీన్‌ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి పూర్ణ ఇలాంటి బోల్డ్ సీన్స్ ఇప్పటికే చాలా చేసింది. దీంతో వాటికి కేరాఫ్‌గా నిలుస్తుందా? అనే ఆశ్చర్యం సైతం వ్యక్తమవుతుంది. 

Latest Videos


పూర్ణ పాత్ర కోసం ఏమైనా చేస్తుంది. పాత్రని రక్తికట్టించేందుకు నటులు ఇలాంటి రిస్క్ లు చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో పూర్ణ ముందే ఉంది. తాను మంచి నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే `అఖండ`లో రేప్‌ సీన్‌ చేసి తన డేర్‌నెస్‌ని చాటుకుంది. 

ఇక బాలయ్య నటించిన `అఖండ` చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శనివారం కర్నూల్‌లో `అఖండ కృతజ్ఞత సభ` పేరుతో శతదినోత్సవ వేడుకని నిర్వహించారు. అభిమానులకు థ్యాంక్స్ చెప్పడం కోసం ఈ ఈవెంట్‌ని నిర్వహించగా, జనం భారీగా వచ్చారు. Poorna Hot Photos.
 

ఇందులో పూర్ణ తళుక్కున మెరిసింది. జిగేల్‌ మనిపించే డ్రెస్‌ ధరించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. తోటి నటి ప్రగ్యా జైశ్వాల్‌ కాస్త అందాల షో చేసినా అందరిచూపు పూర్ణపైనే ఉండటం విశేషం. ఆమె లుక్కు, డ్రెస్‌ అంతగా కట్టిపడేస్తుందని చెప్పాలి. దీంతో `అఖండ` ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచిందీ `ఢీ` భామ. 

సినిమా కెరీర్‌ పరంగా ఒడిదుడుకులతో సాగుతున్న నేపథ్యంలో ఈ భామ మరోసారి లైఫ్‌ ఇచ్చింది `ఢీ` షో. ఈ డాన్స్ షోతో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. అటు టీవీ ఆడియెన్స్ కి, ఇటు ఇండస్ట్రీకి మరింత దగ్గరైంది. `ఢీ`లో ఆమెని చూసి అవకాశాలువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇటీవల పూర్ణ చెప్పడమే అందుకు నిదర్శనం. తనకు ఈ షో చాలా పుష్‌ ఇచ్చిందని పేర్కొంది. 

తెలుగులో పెద్ద సినిమాలు లేక చిన్న చిన్న చిత్రాలతో రాణిస్తున్న పూర్ణకి `ఢీ` తర్వాతభారీ ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల ఆమె `తలైవి`, `దృశ్యం 2`, `అఖండ` చిత్రాలతో విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరిన్ని పెద్ద సినిమాలున్నాయట. అందులో ఒకటి `తీస్‌ మార్‌ ఖాన్‌`. ఇందులో మంచి పాత్ర చేస్తున్నట్టు చెప్పింది పూర్ణ. 
 

అలాగే తెలుగులో `బ్యాక్‌ డోర్‌`తోపాటు మరో సినిమా చేస్తుంది పూర్ణ. మరోవైపు తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. వీటితోపాటు తనకు `అవును` లాంటి హిట్‌ ఇచ్చి టాలీవుడ్‌లో నిలబెట్టిన రవిబాబుతో కలిసి మరో సినిమా చేస్తుందీ సెక్సీ భామ. 

అయితే `ఢీ` 13`లో సందడి చేసిన పూర్ణ.. లేటెస్ట్ సీజన్‌ నుంచి తప్పుకుంది. సినిమా కెరీర్‌ బిజీగా మారిన నేపథ్యంలో టీవీ షోకి టైమ్‌ ఇవ్వలేక తప్పుకున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో షోకి మోనోటనీ ఎక్కువవుతుందని నిర్వహకులు పాత వారిని తొలగించినట్టు టాక్‌. 

పూర్ణ.. అందం, అభినయం మేళవించిన నటి. మంచి పాత్రలు పడితే తానేంటో నిరూపించుకోగలదు. `ఢీ` షోతో బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైన ఈ భామ హాట్‌ హాట్‌ ఫోటోలతో నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 
 

click me!