యాపిల్ ఎలా తినాలి..?
చాలా మంది యాపిల్ పైన తొక్క తీసేసి తింటూ ఉంటారు. కానీ.. అలా కాకుండా.. తొక్కతోనే తినాలని డాక్టర్స్ చెబుతున్నారు. యాపిల్ తొక్క తీయకుండా తింటే ఎక్కువ లాభాలు కలుగుతాయట ఎందుకంటే యాపిల్ తొక్కలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంటున్నారుఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
తొక్కలో ఉండే ఫైబర్ బరువు నిర్వహణలో సహాయపడుతుంది. యాపిల్ తొక్కలో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌లో కూడా ఇది మేలు చేస్తుంది. యాపిల్ పీల్ రఫ్‌గా పనిచేస్తుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది.