పూల బికినీలో పూజా హెగ్డే హాట్ ఫోజు... వైరల్ గా ఆమె లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్

First Published Aug 23, 2021, 2:46 PM IST

పూజా హెగ్డే పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. వరుస హిట్స్ కొడుతూ స్టార్స్ పక్కన అవకాశాలు పట్టేస్తుంది పూజా.

కెరీర్ బిగినింగ్ లో పూజా హిట్స్ లేక సతమతమయ్యారు. జయాపజయాలతో సంబందం లేకుండా పూజాకు అవకాశాలు దక్కాయి. నెమ్మదిగా మొదలైన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 


సౌత్ లో పెద్ద పరిశ్రమలుగా ఉన్న తెలుగు, తమిళంలో ఆమె భారీ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేస్తున్న పూజా, మరో భారీ చిత్రం ఆచార్యలో అవకాశం దక్కించుకున్నారు. 

చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చరణ్ తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది. అలాగే యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చేస్తున్నారు. 


ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన బీస్ట్ మూవీలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ పట్టేసింది పూజా. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న బీస్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 
 

మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

టూ టైర్ హీరోల రేంజ్ పారితోషికం తీసుకుంటున్న పూజా హెగ్డే తిరుగులేని హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. ఓ చిత్రం కోసం పూజా ఏకంగా రూ. 5కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

ఇక సెట్స్ లో అమ్మడు లగ్జరీలు కూడా మాములుగా ఉండవట. ఏకంగా 12మంది స్టాఫ్ ని మైంటైన్ చేస్తూ నిర్మాతలకు షాక్ ఇస్తుంది అంటూ ఇటీవల వార్తలు దుమారం రేపాయి. ఇదే విషయంపై రోజా భర్త దర్శకనిర్మాత సెల్వమణి పూజా పై తీవ్ర ఆరోపణలు చేశారు. 
 


ఆవిషయం అలా ఉంచితే పూజా లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. పూల బికినీ ధరించి ఉన్న పూజా హెగ్డే బోల్డ్ ఫోజు హాట్ టాపిక్ గా మారింది. పూజా ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

click me!