తారక్ నటించిన ‘ఆది’చిత్రంతో వీవీ వినాయక్ (VV Vinayak) దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్, ఖిలాడీ నెంబర్ వన్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించిన వీవీ వినాయక్ కూడా స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతున్నారు.