కూల్ వెదర్ లో కిల్లింగ్ లుక్స్.. బిగుతైన డ్రెస్ లో పరువాలు చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తున్న నివేతా

First Published Aug 8, 2022, 4:43 PM IST

హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. నివేతా గ్లామర్ రోల్స్ తో పాటు.. ఛాలెంజింగ్ పాత్రలో కూడా మెప్పించగలగడం ఆమె ప్రత్యేకత. 

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలు పొందాలంటే ఆమెకి ఓ సరైన హిట్ అవసరం. 

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా నివేతా పేతురాజ్ తాను వెకేషన్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. టైట్ ఫిట్ వైట్ టీ షర్ట్ లో నివేతా తన బరువైన పరువాలని ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోజుల్లో నివేత లుక్స్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

చిరునవ్వులు చిందిస్తూ నివేతా ఇస్తున్న ఫోజులు అద్భుతంగా ఉన్నాయి. కుర్రాళ్ళ హృదయాల్ని నివేత దోచుకుంటోంది. నెటిజన్లు నివేత ఫోజులకు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నివేత గ్లామర్ కి తగ్గ చిత్రం ఇంకా పడలేదు అనే చెప్పాలి. 

ఇదిలా ఉండగా నివేతా పేతురాజ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. రానా, సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నివేతా కీలక పాత్రలో నక్సలైట్ గా నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

click me!