జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

First Published Apr 27, 2024, 5:03 PM IST

ప్రముఖ నటి.. హీరో సూర్య భార్య జ్యోతికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తమిళ సినిమా విమర్శకుడు, నటుడు బైల్వాన్ రంగనాథన్. జ్యోతిక సూర్య కుటుంబం పరువు తీసిందన్నారు. కారణం ఏంటంటే..? 
 

తమిళంలోనే కాదు.. సౌత్ అంతట..  స్టార్ కపుల్ అంటే గుర్తుకువచ్చేవారిలో సూర్య - జ్యోతిక గుర్తుకు వస్తారు. సౌత్ సినిమాలో తమ ప్రత్యేకత చూపించుకున్న సూర్య ‌- జ్యోతిక.. చాలా కాలం ప్రేమించుకుని.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి బెస్ట్ కపుల్ అనిపించుకుంటూ ఉన్నారు. 

jyothika, sivakumar

జ్యోతిక కూడా తన ప్రేమను గెలిపించుకోవడమే కాదు.. సూర్య కుటుంబంతో కలిసిపోయి.. వారి పద్దతులు అన్నీ నేర్చుకుని.. వారు  చెప్పినట్లు... పెళ్లి తర్వాత సినిమా రంగానికి పూర్తిగా దూరంగా ఉంది.  ఇద్దరు పిల్లలతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ.. వారిని చూసుకుటూ గడిపేసింది. ఇక వారు పెద్దవారు కావడం.. చదువుల్లో బిజీ కావడంతో.. జ్యోతిక రీసెంట్ గా రీ ఎంట్రీఇచ్చి.. ప్రత్యేక పాత్రలతో దడదడలాడిస్తోంది. 

రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

Tamil actor Jyothika about fake report

సూర్య పూర్తి మద్దతుతో తన భర్త నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 36 వాడిలే చిత్రంలో స్టాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది జ్యోతిక. ఈ సినిమాతో హిట్ అందుకుంది బ్యూటీ. ఇక పిల్లల చదువుతో పాటు.. మరికొన్ని కారణాల వల్ల జ్యోతిక దంపతులు.. గతేడాది భర్త, పిల్లలతో కలిసి ముంబైలో సెటిల్ అయ్యారు.  జ్యోతిక కూడా బాగా బరువు తగ్గి బాలీవుడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.
 

రోజుకు 5 సిగరెట్లు తాగే హీరోయిన్ ఎవరో తెలుసా..? స్వయంగా వెల్లడించిన బాలీవుడ్ బ్యూటీ...?

 ఆ విధంగా రీసెంట్ గా అజయ్ దేవగణ్ సరసన నటించిన 'సైతాన్' మంచి ఆదరణ పొందింది. దీని తర్వాత రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది బ్యూటీ. ఇక అసలు విషయం ఏంటీ అంటే.. రీసెంట్ గా  తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబయ్ నుంచి వచ్చి ఓటు వేశాడు హీరో  సూర్య. అతను  మాత్రమే ముంబై నుంచి వచ్చి తన ఓటును నమోదు చేసుకున్నారు. దాంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. 

Jyothika

 జ్యోతిక ఓటు వేయడానికి రాకపోవడంతో పలు  విమర్శలకు దారి తీసింది. అయితే ఆమె  నేపాల్ పర్యటనకు వెళ్లినట్లు వీడియోను విడుదల చేసినందుకు, అభిమానులు మరియు నెటిజన్లు జ్యోతికను ఇంకా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఓటు వేయడం ప్రతీ ఒకకరి బాధ్యత.. దాన్ని సక్రమంగా నిర్వర్తించడకపోగా.. నిర్ణక్ష్యం చేసిందంటూ.. ఆమెపై మండిపడుతున్నారు. 

jyothika, sivakumar

ఈ విషయంపై నటుడు, జర్నలిస్టు బైల్వాన్ రంగనాథన్ మండిపడ్డారు. ఆయన  మాట్లాడుతూ... 'ఓటు వేయడానికి జ్యోతిక రాలేదని జర్నలిస్టులు  అడిగినప్పుడు జ్యోతిక మామ.. సూర్య తండ్రి  శివకుమార్ మానసిక స్థితి ఎలా ఉంటుంది..? కొడుకు మాత్రమే వచ్చి ఓటు వేస్తాడు. కానీ కోడలు రాలేదు. దాంతో ఆయన ఎలా ఫీల్ అవుతారు.. నలుగురికి ఏమని సమాధానం చెపుతారు అని ఆయన అన్నారు. 
 

ఈ విషయంలో జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు. అత్తగారింటికి, మామగారికి విధేయుడిగా ఉండాలి. భార్యాభర్తలు కలిసి ఉండాలి. జ్యోతిక అదంతా మరిచిపోయింది.... అంటూ  బెయిల్వాన్  చేసిన ప్రసంగం వివాదాస్పంద అయ్యింది. ఈ విషమంలో సూర్య ఫ్యాన్స్ ఆయన్ను ట్రోల్ చేస్తన్నారు. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

click me!