రిలీజ్ కు ముందే ‘కార్తికేయ 2’పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. అలాగే ప్రమోషన్స్ ను కూడా చాలా క్రియేటివ్ గా చేశారు. అందుకు తగ్గట్టుగానే సినిమా కథ, దర్శకత్వం, సంగీతం, నటీనటుల పెర్పామెన్స్ ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తొలిరోజు యూఎస్ లో 1 లక్ష డాలర్స్ కలెక్షన్లు సాధించింద. హిందీలోనూ అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకోనుంది.