అవుట్ అండ్ ఫన్ రైడ్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డీజే టిల్లు’. ఈ మూవీలో నేహా శెట్టి సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించింది. ‘రాధిక’పాత్రలో ఒకపక్కా నవ్విస్తూనే.. మరోవైపు గ్లామర్ ఒళకబోసింది. మొత్తానికి ఆడియెన్స్ ను కట్టిపడేసి ఫేమ్ దక్కించుకుంది.
అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు నెట్టింటా సందడి చేస్తోంది. గ్లామర్ విందులో హద్దులు దాటేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మాత్రం స్కిన్ షోకు ఛాన్స్ ఇవ్వలేదు. ఫుల్ లాంగ్ స్లీవ్ లో దర్శనమిచ్చింది. డిసెంబర్ నెలకు హాయ్ చెబుతూ స్టన్నింగ్ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
కన్నడకు చెందిన నేహా శెట్టి న్యూ యార్క్ ఫిల్మ్ అకాడెమీలో యాక్టింగ్ నేర్చుకుంది. అంతకు ముందుకు ముందే మోడల్ గా కేరీర్ ను ప్రారంభించింది. మిస్ మంగళూరు బ్యూటీ కాంటెస్ట్ లో నూ పాల్గొని 2014లో టైటిట్ కూడా గెలుచుకుంది. ఆ వెంటనే కన్నడ ఫిల్మ్ ‘ముంగరు మేల్ 2’తో తెరంగేట్రం చేసింది.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆయన కొడుకు ఆకాష్ పూరి సరసన ‘మెహబూబా’లో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కాకపోయినా.. నేహాకు మాత్రం ఇక్కడ గుర్తింపు దక్కింది. దీంతో వెంటవెంటనే ఆఫర్లను దక్కించుకుంది.
‘గల్లీ రౌడీ’తో పటాస్ పిల్లాగా.. ‘డీజే టిల్లు’తో రాధికాగా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే బ్లాక్ బాస్టర్ హిట్ దక్కించుకున్న ‘డీజే టిల్లు’ తర్వాత నేహా కేరీర్ ఊపందుకుంటుదనుకుంటే.. నెమ్మదిగానే సాగుతోంది. మళ్లీ చిన్న సినిమాలకే పరిమతం అవుతోంది.
తెలుగులో తప్న నేహాకు ఇతర భాషా చిత్రాల్లో పెద్దగా ఆఫర్లు లేవు. ఇలా పడంగానే అలా బిజీ అవుతుంటారు హీరోయిన్లు.. కానీ నేహా మాత్రం ఆఫర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. అంటే మరో సాలిడ్ హిట్ పడితేగానే స్పీడ్ పెరిగేలా లేదు. ప్రస్తుతం నేహా కార్తీకేయ సరసన ‘బెదురులంక 2012’లో నటిస్తోంది.