విశ్వక్‌ సేన్‌ డేరింగ్‌ డెసీషన్‌.. క్రేజీ డైరెక్టర్‌తో సినిమా.. మరో జాతిరత్నం అవుతుందా?

By Aithagoni Raju  |  First Published Dec 11, 2024, 10:52 PM IST

విశ్వక్‌ సేన్‌ రూట్‌ మార్చాడు. ప్రయోగాల చేస్తున్నాడు. తాజాగా మరో క్రేజీ మూవీకి ఓకే చెప్పాడు. క్రేజీ దర్శకుడితో సినిమా  చేయబోతున్నాడు. 
 


మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇటీవల వరుసగా బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేశాడు. `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` ఆశించిన స్థాయిలో హిట్‌ కాలేదు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన `మెకానిక్‌ రాకీ` మూవీ సైతం డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం `లీలా` అనే మూవీ చేస్తున్నాడు విశ్వక్‌. ఇందులో ఆయన అమ్మాయిగా కనిపించబోతున్నాడట. ఇలా రొటీన్‌కి భిన్నమైన సినమాలు ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో డేరింగ్‌ డెసీషన్‌ తీసుకున్నారు. కామెడీ మూవీకి ఓకే చెప్పారు. జాతిరత్నంతో కలిపి సినిమా చేయబోతున్నాడు. 

`జాతిరత్నాలు` సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు అనుదీప్‌. ఆయన చేసిన `ప్రిన్స్` మూవీ నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంత గ్యాప్‌తో సినిమా చేయబోతున్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. `ఫంకీ` పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇది బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. `కల్కి2898` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం కావడం విశేషం. అనుదీప్‌, నాగ్‌ అశ్విన్‌ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. 

Tap to resize

Latest Videos

పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ రోజు ప్రారంభమైన ఈ మూవీకి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులతో, చూడగానే అందరి దృష్టిని ఆకర్షించేలా ఫంకీ టైటిల్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ టైటిల్ డిజైన్‌తో పాటు, పోస్టర్ మీద రాసి ఉన్న 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' అనే పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫంకీ సినిమా ప్రేమ, వినోదంతో కూడిన ఓ మంచి కుటుంబ కథా చిత్రమనే భావన పోస్టర్ చూస్తే కలుగుతోంది.

విశ్వక్ సేన్, అనుదీప్ కలయికపై ఉండే అంచనాలకు తగ్గట్టుగా, `ఫంకీ` చిత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. వినోదాన్ని పంచడంలో దర్శకుడు అనుదీప్ ది విభిన్న శైలి. అలాంటి అనుదీప్ కి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల ప్రతిభగల నటుడు విశ్వక్ సేన్ తోడయ్యారు. ఈ ఇద్దరు కలిసి అన్ని వర్గాల ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వుకునే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు సురేష్ సారంగం కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతి తర్వాత `ఫంకీ` సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని టీమ్‌ తెలిపింది. అనుదీప్‌, విశ్వక్‌ సేన్‌ కాంబో అంటేనే చాలా క్రేజీగా ఉంది. మరి వీరిద్దరు కలిసి ఏ మేరక నవ్విస్తారో చూడాలి.  

undefined

read more: `పుష్ప 3` కాదు, సందీప్‌ వంగా కాదు.. అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఎవరితో తెలుసా? అస్సలు ఊహించలేరు

also read: కీర్తిసురేష్‌ పెళ్లి సందడి షురూ, స్పెషాలిటీ ఏంటంటే? ఈ రహస్యానికి కారణమదేనా?
 

click me!