బాలయ్య `అఖండ 2ః తాండవం` వచ్చేది అప్పుడే, వచ్చే ఏడాది ఫ్యాన్స్ కి డబుల్‌ ట్రీట్‌, షూటింగ్‌ అప్‌డేట్‌

Published : Dec 11, 2024, 06:06 PM IST
బాలయ్య `అఖండ 2ః తాండవం` వచ్చేది అప్పుడే, వచ్చే ఏడాది ఫ్యాన్స్ కి డబుల్‌ ట్రీట్‌, షూటింగ్‌ అప్‌డేట్‌

సారాంశం

బాలకృష్ణ ప్రస్తుతం `డాకు మహారాజ్‌` చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా కొత్త సినిమా అప్‌ డేట్స్ ఇచ్చాడు. `అఖండ 2ః తాండవం` రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.   

గాడ్‌ ఆఫ్‌ మాస్‌గా అభిమానులు పిలుచుకుంటున్న హీరో బాలకృష్ణ. ఆయన ఇటీవల మంచి జోరుమీదున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు `అన్‌ స్టాపబుల్‌` షోతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `అన్‌ స్టాపబుల్‌ 4`వ సీజన్‌ తో ఆకట్టుకుంటున్నారు. తనదైన జోష్‌తో దుమ్మురేపుతున్నాడు. అదే సమయంలో ఇప్పటికే హ్యాట్రిక్‌ హిట్స్ తో సినిమాల పరంగానూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ `డాకు మహారాజ్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. 

మరోవైపు తన కొత్త సినిమా అప్‌ డేట్‌ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఆయన `డాకు మహారాజ్‌` సినిమాతోపాటు `అఖండ 2`ః తాండవం` చిత్రంలోనూ నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. నేటి నుంచే చిత్రీకరణ ప్రారంభించినట్టు టీమ్‌ వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. సినిమా ఓపెనింగ్‌ రోజే రిలీజ్‌ డేట్‌ని ఇవ్వడం విశేషం. వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ కూడా రాబోతుంది. దసరాకి విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ వెల్లడించింది. 

వచ్చే దసరాని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 25న సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన `అఖండ` చిత్రానికిది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. `అఖండ 2ః తాండవం` పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. శివుడి తత్వం ప్రధానంగా ఈ మూవీని  తెరకెక్కించబోతున్నారు బోయపాటి. బాలయ్య మార్క్ మాస్‌, యాక్షన్‌, అదిరిపోయే డైలాగులు ఉంటాయట. వాటి డోస్‌ కూడా పెంచబోతున్నట్టు సమాచారం. 

ఈ సినిమాని 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించబోతున్నారు. ఇందులో బాలయ్య చిన్న కూతురు కూడా భాగం కానుంది. తేజస్విని కూడా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా చేస్తున్న ప్రశాంత్‌ వర్మ సినిమాతో తేజస్విని నిర్మాతగా మారుతుంది. ఇప్పుడు తండ్రి సినిమాకి కూడా ఆమె సమర్పకులురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం. మొదటి భాగంలో ఉన్న ప్రగ్యాజైశ్వాల్‌ ఇందులోనూ హీరోయిన్‌గా నటించబోతుంది. ఇక `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` వంటి హ్యాట్రిక్‌ హిట్స్ తర్వాత ఇప్పుడు నాల్గో సారి బాలయ్య, బోయపాటి కలిసి ఈ సినిమా చేస్తున్నారు. మరో భారీ యాక్షన్‌ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న `డాకు మహారాజ్‌` సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయగా, అది అదిరిపోయింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో సరికొత్త లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నారు. ఆయన పాత్ర కూడా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండనుందని, బాలయ్య కెరీర్‌లోనే ఇది స్పెషల్‌ ఫిల్మ్ గా నిలుస్తుందని దర్శకుడు బాబీ తెలిపారు. 


 read more:మోహన్‌బాబు చేసిన దాడికి మంచు విష్ణు వివరణ, తమ్ముడు మనోజ్‌ గురించి ఆయన ఏం చెప్పాడంటే?


also read: `పుష్ప 2` సినిమా లీక్‌, వెయ్యి కోట్లు కలెక్షన్ల దిశగా వెళ్తుండగా పెద్ద దెబ్బ

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌