Published : Apr 12, 2025, 01:16 PM ISTUpdated : Apr 12, 2025, 01:21 PM IST
నరసింహా ( పడయప్పా) సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తయింది. ఈసినిమాలో నీలాబరిగా రమ్యకృష్ణ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇన్నేళ్ళ తరువాత రమ్యకృష్ణ మళ్లీ రజనీకాంత్తో కలిసి 'జైలర్ 2'లో నటిస్తుంది.
రజనీకాంత్ నటించిన నరసింహ ( 'పడయప్పా') సినిమా విడుదలై 10వ తేదీకి 26 ఏళ్లు పూర్తయ్యాయి. రమ్యకృష్ణ ఈ సినిమాలో నీలాంబరిగా ఒక గుర్తుండిపోయే పాత్రలో నటించారు. అంతేకాకుండా రమ్యకృష్ణ సినీ జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు.
నరసింహ సినిమాలో రజనీకాంత్ ను ప్రేమించి.. ఆతరువాత విలన్ గా మారే పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీతో కలిసి నటించిన సినిమా 'జైలర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు జైలర్ సినిమాకు సీక్వెల్ వస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జైలర్ 2 సినిమా ప్రోమో వీడియోను సన్ పిక్చర్స్ సంస్థ పొంగల్ సందర్భంగా విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు జైలర్ 2 సినిమా షూటింగ్ను చిత్రబృందం ప్రారంభించింది.
రమ్యకృష్ణ తన ఇన్స్టాలో 'జైలర్ 2', పడయప్పా సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. అందులో పడయప్పా 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, జైలర్ 2 సినిమా మొదటి రోజు షూటింగ్ అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా షూటింగ్ స్పాట్లో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం 'జైలర్ 2' కేరళ రాష్ట్రంలోని అట్టపాడి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుుంది.
జైలర్ 2 సినిమాలో రమ్యకృష్ణన్ విజయ పాండియన్(విజి) అనే పాత్రలో నటిస్తుండగా, రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ గా నటిస్తున్నారు. ఇంకా మిర్నా మీనన్, ఎస్ జే సూర్య, యోగి బాబు చాలా మంది స్టార్స్ ఈసినిమాలో కనిపించబోతున్నారు. ఇక మిర్నా మీనన్, ఎస్ జే సూర్య సంబంధించిన సీన్లు ఇప్పుడు కేరళలో షూటింగ్ చేస్తున్నారు.