Intinti Gruhalakshmi: మోడ్రన్ డ్రస్సులో గృహలక్ష్మి.. తులసిపై నిందలు వేసిన నందు, అనసూయలు!

First Published Oct 27, 2022, 11:08 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సామ్రాట్ ని, తులసి మిగిలిన వాళ్ళు అందరూ కలిసి గదిలో పడుకోబెడతారు. అప్పుడు సామ్రాట్ కి జ్వరంగా ఉన్నది అని తెలుస్తుంది. తులసి వచ్చి కాషాయం ఇస్తుంది. అక్కడున్న పిల్లలతో డాక్టర్ కి ఫోన్ చేయండి అని తులసి అనగా వాళ్ళు  డాక్టర్ కి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తరు. మీరు చేస్తూనే ఉండండి నేను సామ్రాట్ గారిని చూసుకుంటాను మా వల్ల మీకు పార్టీ పాడవకూడదు కదా అని చెప్పి తులసి సామ్రాట్ లు గదిలో ఉండి మిగిలిన వాళ్ళు బయట ఉంటారు. మరోవైపు నందు టైం మూడ్ అవుతుంది ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు.
 

 వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండు ఉంటారా నేను లాస్యతో చేసిన తప్పు సామ్రాట్ తులసి తో చేస్తాడా అని భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో సామ్రాట్ కి కషాయం ఇష్టం లేకపోయినా తులసి ఒక్కొక్క ముద్ద తాగిపిస్తూ ఉంటుంది.అప్పుడు సామ్రాట్, మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను తులసి గారు నేను మిమ్మల్ని అని ఆ మాటని అక్కడితోనే ఆపేస్తాడు సామ్రాట్. తులసి కి ఆ మాటలు అర్థం కావు ఇంతలో అక్కడ పిల్లలు వచ్చి డాక్టర్ కి ఫోన్ చేశాను ఎత్తలేదు అని చెప్తారు. మరోవైపు నందు ప్రేమ్ ఫోన్ తీసుకొని ఈ నెంబర్ కి కదా ఫోన్ వచ్చింది. 
 

మళ్ళీ అదే నెంబర్ కి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తాడు. అక్కడ ఒక అతను ఫోన్ ఎత్తగా నందు కి అతను చెప్పిన మాటలేవీ వినిపించవు. జ్వరం వచ్చింది లోపల ఉన్నారు అనే మాటలు పట్టించుకోకుండా చివరిలో ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు అన్నమాట మాత్రమే వినిపించి కోపంతో ఫోన్ కట్ చేస్తాడు నందు. ఆ తర్వాత రోజు ఉదయం సామ్రాట్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా తులసి కూర్చుని ఉంటుంది. ఎలా ఉన్నది సామ్రాట్ గారు అని తులసి అడగగా నాకు బానే ఉందండి నిన్నటి కన్నా కొంచెం జ్వరం తగ్గింది. తులసి గారు నేను ఒక విషయం చెప్తాను ఏమనుకోవద్దు.
 

 నిన్న రాత్రి నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా లేకపోతే అసభ్యంగా ప్రవర్తించానా అని అడుగుతాడు. దానికి తులసి, అయ్యో సామ్రాట్ గారు మీరు ఎందుకు అలాగా అయిపోతున్నారు మీరు మంచి మనిషి మీరు ఎప్పుడూ హద్దు దాటరు మీరేమి అవుసభ్యంగా ప్రవర్తించలేదు ఇంక మనం బయలుదేరుదామా అని అనగా, నేను క్యాబ్ బుక్ చేశాను మీరు వెళ్ళండి. నేను కార్ బాగు చేయించుకుని వెళ్తాను అని సామ్రాట్ అంటాడు. మరోవైపు తులసి కుటుంబ సభ్యులందరూ తులసి కోసం ఎదురు చూస్తూ ఉండగా నందు, లాస్య, అనసూయ మాత్రం బాగా కోపంతో రగిలిపోతూ ఉంటారు.
 

 తులసి వస్తున్నప్పుడు సామ్రాట్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కోపంగా ఉంటాడు. తులసి ఇంటికి వస్తుంది. అమ్మా ఎలా జరిగింది ప్రయాణం అని దివ్య అడగగా, ప్రయాణం కాదు ప్రేమయనం ఇద్దరూ బాగా తిరిగారు కదా అలిసిపోయి ఉంటారు అని నందు అంటాడు. దానికి తులసి మిస్టర్ నందగోపాల్ గారు అని అంటుంది. అప్పుడు అనసూయ, నందు ని అనడం కాదు నీ బట్టలు చూడు అవే చెప్తున్నాయి నిజ నిజాలు ఏంటో అని అనగా, జరిగిన విషయం అంతా తులసి చెప్తుంది సామ్రాట్ గారికి ఒంట్లో బాలేదు అందుకే గదిలోకి తీసుకెళ్లాను అని అనగా నువ్వు గదిలో ఉన్నావా లేదా!
 

 ఇద్దరు కలిసే ఉన్నారు కదా ఒక మంచం మీదే ఉన్నారా ఇలాంటివన్నీ అడుగుతాడు నందు. దానికి తులసి, నేను ఏ తప్పు చేయలేదు మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అయినా సరే మీకు చెప్పాను. అవును మేమిద్దరం ఒకే గదిలో ఉన్నాము కానీ విడాకులకు ముందు మీరు లాస్యతో ఉన్నట్టుగా కాదు. సామ్రాట్ గారికి జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్తుంది. దానికి లాస్య,  సామ్రాట్ తులసి అక్కడ ఉన్న పిల్లలతో డాన్స్ వేసిన వీడియో చూపిస్తూ ఇలాగేనా పడిపోయారు బా డాన్స్ చేసినట్టున్నారు కదా అని అనగా నందు, సామ్రాట్ పడిపోవడం కాదు నువ్వు వాడి చేతిలో పడిపోయినది లేదా అని అంటాడు.
 

 దానికి తులసి, మీ మాట అదుపులో పెట్టుకోండి నందగోపాల్ గారు ఒక మాట మాట్లాడే ముందు చుట్టుపక్కల కొడుకులు, కోడళ్ళు, పెద్దలు, పిల్లలు ఉంటారని గుర్తుంచుకోండి వాళ్ళముందు ఇలాగ మాట్లాడేది అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడవలసినదే!
 

click me!