చీరకట్టులో ‘ఢీ’ జడ్జీ కవ్వించే ఫోజులు.. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్ఫరెంట్ శారీలో నందితా శ్వేతా మెరుపులు

First Published | Oct 7, 2023, 11:35 AM IST

‘ఢీ’ బ్యూటీ నందితా శ్వేతా (Nandita Swetha)  బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. చీరకట్టులో దర్శనమిచ్చి అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యంగ్ హీరోయిన్ నందితా శ్వేతా వెండితెరపై వరస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద హిట్లు లేకున్నా అవకాశాలను అందుకోవడంలో విఫలం కావడం లేదు. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. 
 

నందితా శ్వేతా విభిన్న పాత్రలను పోషిస్తూ అలరించేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా క్రైమ్ థ్రిల్లర్ ‘హిడింబ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనుషులను చంపుకతినే ఓ జాతికి చెందిన వారిని చేధించే ఆఫీసర్ పాత్రలో నందితా అద్భుతంగా నటించింది. 
 


తన పెర్ఫామెన్స్ ను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నందితా ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది.
 

తాజాగా నందితా బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో, అదిరిపోయే చీరలో కొంగుచాటు అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. 
 

అదిరిపోయే ఫోజులతో నందితా శ్వేతా అందాల విందు చేసింది. మతులు చెడగొట్టేలా గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేసింది. తాజాగా పంచుకున్న ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక ఈ ముద్దుగుమ్మ ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమ కథ చిత్రమ్ 2’, కపటధారి’, ‘అక్షర’ వంటి చిత్రాలతో పాటు మరిన్ని సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొన్నేళ్ల పాటు తమిళంలో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు, తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. 
 

Latest Videos

click me!