#TheGhost: నాగ్ ‘ది ఘోస్ట్’OTT డిటేల్స్.. అఫీషియల్

First Published Oct 6, 2022, 8:38 AM IST

 నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ది ఘోస్ట్ . ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన సినిమాలో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌‌ఎల్‌‌పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. నటిస్తుండగా.. గుల్‌ పనగ్‌, అనిక సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటించారు.


సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ మూవీ ద‌స‌రా పండ‌గ కానుక‌గా  ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను ఉన్నాయి. నాగార్జున కూడా ఈ మూవీతో సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాల‌ని తెగ ముచ్చ‌ట ప‌డ్డారు.  విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  అయితే చిరంజీవి గాఢ్ ఫాధర్ చిత్రంతో పోటీపడిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది.  ఇదిగా ఉంటే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు సంభందించి అఫీషియల్ న్యూస్ బయిటకు వచ్చింది.
 

The Ghost Movie Review


నాగార్జున కంప్లీట్ యాక్షన్ మోడ్‌‌లో కనిపించిన ఈ చిత్రాన్ని Netflix వారు సొంతం చేసుకుని స్ట్రీమింగ్ చేస్తున్నారు. గతంలో నాగ్ నటించిన వైల్డ్ డాగ్ చిత్రం సైతం వారే కొనుగోలు చేస్తే ఓటిలో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఉత్సాహంతోనే మంచి పే చెక్ ఇచ్చి ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని గ్లోబర్ గా సక్సెస్ చేసిన నెట్ ప్లిక్స్ ఈ సినిమాని నేషనల్ వైడ్ సక్సెస్ చేయటానికి మార్కెటింగ్ ప్లాన్స్ చేస్తోందని వినికిడి. 

The Ghost Movie Review


ఇది నాగార్జునకు ఆనందం కలిగించే విషయం. బ్రహ్మాస్త్రతో హిందీవారికి మరోసారి గుర్తు చేయటంతో ఓటిటి సైడ్ మంచి మార్కెట్ ఏర్పడిందంటున్నారు. అయితే ఓటిటి రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. ఎగ్రిమెంట్ ని బట్టి ఉంటుందని అంటున్నారు.  
 

The Ghost Movie Review


సినిమా థియేటర్ లో విడుదలైన కొద్ది రోజులకే ఓటిటి కి వచ్చేయడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినిమా ధియేటర్ల యాజమాన్యం చాలా నష్టాలు చూసే పరిస్థితి ఇటీవల నెలకొంది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా.. తక్కువ టైంలోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. సినిమా ఏమాత్రం ఫ్లాప్ అయితే రెండు వారాల లోపే ఓటిటి లోకి ప్రత్యక్షమవుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్ లు చాలా నష్టపోతున్నారు.

The Ghost Movie Review

ఈ పరిణామంతో ఇప్పుడు తెలుగు ఫిలిం చాంబర్.. సినిమా డిస్ట్రిబ్యూటర్ మరియు సినిమా ధియేటర్ ల యాజమాన్యాలు నష్టపోకుండా ఓటిటి విడుదల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు పది వారాల గ్యాప్ తర్వాత ఓటిటి లోకి విడుదల చేయాలని కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత చిన్న బడ్జెట్ సినిమా 6 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ కలిగిన సినిమా నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటిటి లోకి విడుదల చేసే అవకాశం కల్పిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓటిటి విడుదలకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది.

The Ghost Movie Review

ఐదేళ్ళ క్రితం ‘గరుడవేగ’ను ఎన్.ఐ.ఎ. నేపథ్యంలో తెరకెక్కించిన ప్రవీణ్ లాస్ట్ ఇయర్ కార్పొరేట్ క్రైమ్ నేపథ్యంలోనే ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ తీశాడు. సో.. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ ప్రాజెక్ట్ విషయంలో జస్ట్ కేక్ వాక్ చేశాడంతే. అయితే నాగార్జున బాడీ లాంగ్వేజ్​ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్స్​ను, అక్కినేని అభిమానులను నిరుత్సాహానికి గురి చేయకుండా రొమాంటిక్ సాంగ్​కు ప్రాధాన్యమిచ్చాడు. 

The Ghost Movie Review

నాగార్జున  ఈజీగా, స్టైలిష్‌గా చేశారాయన. ఆయన కెరీర్‌లో చేసిన మోస్ట్ వయలెంట్ రోల్ ఇది. ఆయనకు తోడుగా ప్రియ పాత్రలో సోనాల్ చౌహన్ అదరగొట్టింది. తెలుగులో ఆమె తొలిసారి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. యాక్షన్ సీన్స్‌లో నాగార్జునతో పోటీగా చేసింది.

The Ghost Movie Review

ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త యాక్ష‌న్ కోణంలో నాగార్జున‌ను ప్ర‌జెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు (Praveen Sattaru). ఇప్పటికే విడుదలైన నాగార్జున ఫస్ట్ లుక్, కిల్లింగ్ మెషిన్ విజువల్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించిన చిత్రమిది.

  
 ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా ది ఘోస్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు డిజైన్ చేశారు. నాగార్జునను డిఫరెంట్‌గా చూపించారని.. అక్కినేని అభిమానులకు ది ఘోస్ట్ సినిమా విజయదశమి ట్రీట్‌ అని అంటున్నారు. అక్కినేని నాగార్జున కెరీర్​లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. ఈ యేడాది ఇప్పటికే ‘బంగార్రాజు, బ్రహ్మాస్త్రం’ చిత్రాలతో జనం ముందుకు వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్’తో మరోసారి పలకరించారు.

ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ లను గత నెలలో దుబాయ్ (Dubai)లోని ఎడారిలో చిత్రీకరించారు. ఇందుకు థాయ్ లాండ్ కు చెందిన స్టంట్ డైరెక్టర్ సీలుమ్ ఆధ్వర్యంలో మూము బారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు దర్శకుడు ప్రవీణ్ సత్తార్.  అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో అభిమానుల్లో జోష్ నింపాడు. ఇందుకు నాగార్జున ప్రత్యేకమైన ఎక్సర్ సైజులు చేసిన విషయం తెలిసిందే. బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు నాగార్జున చాలా శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తోంది.  

click me!