Karthika Deepam: చిల్లర వేషాలు వెయ్యొద్దు మోనిత.. డాక్టర్ బాబు డైలాగ్‌లకు హద్దుల్లేవు బాబోయ్!

First Published Nov 9, 2022, 7:25 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 9వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..  శౌర్య చంద్రడు చేసిన పని గురించి ఆలోచిస్తుంటే.. ఏమైంది అమ్మ అలా ఉన్నావ్ అంటే.. అప్పుడు చంద్రుడు పూజారి గారి దగ్గర అమ్మ నాన్న పేర్లు చెప్పమంటే మా పేర్లు చెప్పడం వల్లే కదా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు.. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న పేర్లు చెబితే విల్లు ఎవరు అని అడుగుతారు.. ఇక అప్పుడు కథ మొత్తం చెప్పాలి.. ఒకవేళ మీ నానమ్మ తాతయ్య వాళ్ళు వస్తే తెలిసిపోతుందని అలా చెప్పడం ఎందుకనే చెప్పలేదు అని చేప్తాడు. ఆతర్వాత శౌర్య సంగారెడ్డికి ఎప్పుడు వెళదాం అని అడుగుతే అక్కడికి ఎందుకు అమ్మ అని అంటాడు. 
 

ఒక్కసారిగా శౌర్య షాక్ అవుతుంది.. అదేంటి బాబాయ్ అలా అంటావ్.. అమ్మను వెతికేందుకే కదా మనం ఇక్కడికి వచ్చాము.. ఇప్పుడు ఇలా అంటావు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు చంద్రమ్మ అలా ఎలా మర్చిపోతాడు అని అంటే లేదమ్మా ఇప్పుడే కదా మనం ఈ ఇంటికి వచ్చాము ఇక్కడ ఇల్లు సర్దుకోవాలి అన్ని చూసుకోవాలి కదా అని అంటే నీలో మార్పు వచ్చింది బాబాయ్.. నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ అని శౌర్య అడుగుతుంది. అదేంటమ్మా అలా అనేశావు అంటే లేదు బాబాయ్ నువ్వు  భయపడుతున్నావు అని అంటుంది. 
 

ఇక మరో సీన్ లో మోనిత వంటలక్క ఇంటి దగ్గర వచ్చి వెయిట్ చేస్తూ కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. అక్కడికి దుర్గ వచ్చి దీపమ్మా అని పిలిస్తే ఆ దీప ఇంట్లో లేదు రా అని అంటుంది. మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్.. ఇంటికి కుక్కలా కాపలా కాస్తున్నావా అని మోనితకు కోపం తెప్పిస్తాడు. ఆతర్వాత పోరా అని అంటే అప్పుడు దీప కార్తీక్ లేచిపోతారు... వాళ్లకు కావాల్సిన టైమ్ లో లేచిపోతారు.. అంటే మోనిత నమ్మదు.. ఇప్పుడు కావాలంటే చూడు వంటలక్క, డాక్టర్ బాబు కలిసి వస్తారు అంటే రారు రారు అని అరుస్తుంది. 
 

ఆ సమయంలోనే డాక్టర్ బాబు, వంటలక్క కలిసొస్తారు వాళ్ళని చూసి మోనిత షాక్ అవుతుంది. ఆతర్వాత మోనితనే దుర్గను వంటలక్క ఇంటికి తీసుకొచ్చి కబుర్లు చెబుతుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఇక అనుమానపు డాక్టర్ బాబు మోనితతో ఒక ఆట ఆడుకుంటాడు. నీకు ఆ ఇల్లు సరిపోలేదా ఇక్కడకు వచ్చావ్.. ఓ అక్కడ స్టాఫ్ ఉంటారని ఇలా వచ్చావా అని మోనితను అనుమానిస్తాడు.. అంతే మోనిత పిచ్చి చూపులు చూస్తూ ఆపు కార్తీక్ నేను ఇక్కడకి వచ్చింది మీ సంగతి తేల్చడానికి, అసలు మీ అవతారం ఏంటి అని మోనిత తిడుతుంది.
 

ఇక అప్పుడే వంటలక్క మాట్లాడుతూ మోనితతో గొడవ పడే ఓపిక తీరిక నాకు లేవు.. ప్లీజ్ మోనితను తీసుకెళ్లండి డాక్టర్ బాబు అని చెబుతుంది. అప్పుడు మోనిత నా మొగుడుతో ఊరంతా తిరిగేకి నీకు టైమ్ ఉంటుంది. నాతో మాట్లాడేకి లేదా అని ముందుముందుకు వస్తుంటే డాక్టర్ బాబు సీరియస్ అయిపోతాడు. నోరు ముయ్యి ఎవరు ఎవరిని పట్టుకొని వేలాడుతున్నారు.. వంటలక్క బాధపడుతుంటే సాయం చేస్తున్నాను.. నీకు తన మొకం చూస్తే తెలియడం లేదు బాధలో ఉందని అంటూ మోనితను అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇక ఆతర్వాత వంటలక్క శౌర్య ఫోటో చూసి కన్నీళ్లు పెడుతుంది. 
 

మరో సీన్ లో ఆనంద్ రావు, హిమ ఇద్దరు హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్తే అక్కడ లక్ష్మణ్ కనిపిస్తాడు. అప్పుడు ఆనంద్ ను ఇంటికి తీసుకురమ్మని అడిగితే అక్కడ నుంచి ఆనంద్ రావు తీసుకెళ్తాడు. మరోవైపు మోనిత కార్తీక్ కి గతం గుర్తొచ్చిందా రాలేదా తెలుసుకోవాలని కార్తీక్ పర్సు చూస్తుంది. ఇంత డబ్బు కార్తీక్ దగ్గరకు ఎలా వచ్చిందని అనుకుంటున్నప్పుడు కార్తీక్ అక్కడికి వస్తాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి చిల్లర కోసం వెతుకుతున్న అంటే చిల్లర వేషాలు వేయకు మోనిత నేను బయటే ఉన్న కదా నన్ను అడగాల్సింది అని తిడుతాడు. అప్పుడే ఈ డబ్బంతా నీకు ఎక్కడ నుంచి వచ్చింది అని అంటే గొలుసు తాకట్టు పెట్టాను అని షాకిస్తాడు. ఆ మాటలకూ మోనిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి గొలుసు తాకట్టు పెట్టావా? అంత అవసరం నీకు ఏం వచ్చింది? నేనున్నాను కదా నన్ను అడగొచ్చు కదా అని మోనిత అంటుంది. నీ మీద బతకడం నాకు ఇష్టం లేదు అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు.

 అలా అంటావు ఏంటి కార్తీక్ నేను ఏం తప్పు చేశానని నన్ను ఇలా వేధిస్తున్నావు అంటుంది.. అప్పుడే సీన్ లోకి మోనితా అంటూ దుర్గ ఎంట్రీ ఇస్తాడు.. మోనిత నా గోల్డ్ చైన్ ఎలా ఉంది అంటే నాకు ఎందుకు చూపిస్తున్నావు అని మోనిత సీరియస్ అవుతుంది. అదేంటి నువ్వు కొనిపెట్టిన చైన్ నీకు చూపించకపోతే ఎలా అనగానే.. నా మేడలో చైన్ లేకపోతే ఏంటి నువ్వు అభిమానించే వారి మేడలో ఉంది కదా అని డైలాగ్ వేస్తాడు కార్తీక్. అప్పుడు ఆ చైన్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు కార్తీక్ అంటే నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చానని ఎందుకు చెప్తారు అని వెళ్ళిపోతాడు. దుర్గ వెళ్ళిపో ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అంటే నువ్వు కార్తీక్ ను వదిలెయ్యు అంటే మోనిత కోపంగా చూస్తుంది. అంతే ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి తర్వాత లో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

click me!