మహేష్‌, ప్రభాస్‌ స్థానాలు గల్లంతు చేసి..ఎన్టీఆర్‌, బన్నీలకు మళ్లీ షాకిచ్చిన విజయ్‌ దేవరకొండ

First Published Jun 2, 2021, 9:56 AM IST

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మళ్లీ తన సత్తా చాటాడు. సూపర్ స్టార్స్ మహేష్‌, ప్రభాస్‌ స్థానాలు గల్లంతు చేశాడు. అలాగే ఎన్టీఆర్‌, బన్నీ, చెర్రీలకు మరోసారి బిగ్‌ షాకిచ్చాడు. వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకున్నాడు. 
 

`అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం`తో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండకి ఆడియెన్స్ ని నుంచి విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది. ఆయన కోసం ఎగబడే, పడిచచ్చే అమ్మాయి, అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు స్టయిల్‌ పరంగానూ స్టయిల్‌ కా బాప్‌ అనిపిస్తున్నాడు.
undefined
ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి హైదరాబాద్‌ టైమ్స్ 2020కిగానూ ప్రకటించిన `మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్‌`-30లో నెంబర్‌ వన స్థానాన్ని దక్కించుకున్నాడు.
undefined
అయితే సూపర్‌ స్టార్‌ మహేష్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ల స్థానాలు కూడా లేకుండా చేశాడు. మరోవైపు ఎన్టీఆర్‌, బన్నీ, చెర్రీ, రామ్‌ వంటి స్టార్స్ కి మరో సారి షాక్‌ ఇచ్చాడు. వరుసగా మూడేళ్లుగా మొదటి స్థానాన్ని దక్కించుకుంటున్నాడు.
undefined
టాప్‌ 30లో టాప్‌ టెన్‌ జాబితా చూస్తే విజయ్‌ దేవరకొండ తర్వాత స్థానం రామ్‌ పోతినేని దక్కించుకున్నాడు. గతేడాది ఆయన మూడో స్థానంలో ఉన్నాడు.
undefined
మూడో స్థానంలో ఎన్టీఆర్‌ నిలిచాడు. గతేడాది 19వ స్థానంలో ఉన్న యంగ్‌టైగర్‌ అందరిని వెనక్కి నెట్టేసి థర్డ్ ప్లేస్‌కి వచ్చాడు.
undefined
నాల్గో స్థానంలో రామ్‌చరణ్‌ ఉన్నారు. గతేడాది ఆయన రెండో స్థానంలో ఉండగా రెండు స్థానాలు పడిపోయాడు.
undefined
ఐదో స్థానంలో నాగశౌర్యనిలవడం విశేషం. ఆయనకిదే ఫస్ట్ టైమ్‌.
undefined
ఆరో స్థానంలో నాగచైతన్య ఉన్నారు. గతేడాది ఆయన 11వ స్థానంలో ఉన్నారు.
undefined
హైదరాబాద్‌ 23ఏళ్ల కుర్ర మోడల్‌ ముస్తాఫా దావూడ్‌ ఏడో స్థానంలో నిలిచాడు. అతనికిది న్యూ ఎంట్రీ.
undefined
ఎనిమిదో స్థానంలో హైదరాబాద్‌ బేస్డ్ టీవీ హోస్ట్ సల్మాన్‌ జైదీ నిలిచారు. గతేడాది అతను ఐదో స్థానంలో ఉన్నారు.
undefined
తొమ్మిదో స్థానాన్ని సందీప్‌ కిషన్‌ దక్కించుకున్నాడు. గతేడాది సందీప్‌ 26వ స్థానంలో ఉండటం విశేషం.
undefined
పదో స్థానంలో నవదీప్‌ ఉన్నాడు. గతేడాది ఇతనిది 15వ స్థానం.
undefined
స్టయిలీష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 16వ స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన 12వ స్థానంలో ఉన్నారు.
undefined
ఇందులో బిగ్‌బాస్‌4 ఫేమ్‌ అఖిల్‌ 14వ స్థానంలో ఉన్నారు. ఆయనకిది న్యూ ఎంట్రీ.
undefined
click me!