Karthika Deepam: మాస్టర్ ప్లాన్ వేసిన మోనిత.. మోనితను అసహ్యించుకుంటున్న కార్తీక్..

First Published Jan 13, 2023, 8:34 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో విషయం ఏంటో చెప్పు అది తీసుకోవాల్సిన నిర్ణయం కాదో నేను చెప్తాను అని అంటాడు కార్తీక్. మోనిత నాటకాలు వాడుతూ అయినా నేను నిన్ను ఏమడుగుతున్నాను కార్తీక్ ప్రేమగా ఉండమంటున్నాను కదా అనగా మోనిత విషయం ఏంటో చెప్పు పది నిమిషాలు అన్నావు అంతకంటే ఎక్కువ సేపు వినాల్సిన ఓపిక సమయం నాకు లేదు అని అనగా సరే కార్తీక్ అదే పాయింట్ కి వస్తున్నాను అని అంటుంది మోనిత. నువ్వు నాకు దక్కవని అర్థమైంది కార్తీక్ అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ వెంటనే కార్తీక్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నాకు జీవితంలో కనిపించవా ఆ పని చేయ నీకు శతకోటి వందనాలు పెడతాను అని అంటాడు.
 

నువ్వు పిలిచినా వినపడినంత దూరం వెళ్ళిపోతాను కార్తీక్ కానీ నా గుండె చప్పుడు మాత్రం నీకు వినిపిస్తూనే ఉంటుంది అని అనగా నాకు అర్థం కాలేదు అంటాడు కార్తీక్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు కార్తీక్ నీకు దీప బ్రతకడం కావాలి. బతికే అవకాశం ఉంది అని చెబుతున్న అనడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు. చూసావా అప్పుడే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు అనడంతో అప్పుడు కార్తీక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడానికి సిద్ధపడగా ప్లీజ్ కూర్చో కార్తీక్ అని అంటుంది. నేను చెప్పేది విను కార్తీక్, దీప చనిపోదు నేను చనిపోతాను. నా గుండెను దీపకు మార్పిడి చెయ్యి అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇలా అయినా నా గుండె చప్పుడు నీకు వినిపించేలా చేస్తాను దీపలో నన్ను నా ప్రేమను అర్థం చేసుకో కార్తీక్ అని అంటుంది.
 

అప్పుడు మోనిత నాటకాలు ఆడుతూ నువ్వంటే నాకు ప్రేమ పిచ్చి ప్రేమ కార్తీక్ అని అర్థం చేసుకో అని అంటుంది. నువ్వంటే పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే కృత్రిమంగా బిడ్డను కన్నాను ఇలా ఎవరు చేస్తారు చెప్పు కార్తీక్ అనడంతో కార్తీక్ ఆలోచనలో పడతాయి. అప్పుడు కార్తీక్ నువ్వు మారావ్ అంటే అసలు నమ్మను అది కూడా దీపకు నీ గుండె ఇస్తాను అంటే నేను అసలు అది కూడా నమ్మను. ప్లీజ్ కార్తీక్ నా మాట నమ్ము కార్తీక్ అప్పుడు వేరే ఇప్పుడు వేరు అని అంటుంది మోనిత. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను మోనిత అని అంటాడు కార్తీక్. సిగ్గు లేదా నీకు అసలు మానవత్వం ఉందా దీప పరిస్థితి తెలిసి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటూ మోనిత మీద సీరియస్ అవుతాడు కార్తీక్.
 

మరొకవైపు హేమచంద్ర, దీప ఇద్దరు హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్లకు చెప్పాలని ఉంది కానీ ధైర్యం చాలడం లేదు అన్నయ్య అని అంటుంది దీప. ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. అత్తయ్య హేమచంద్ర అన్నయ్య నన్ను కాపాడి ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అన్నయ్య నన్ను సొంత చెల్లెలా చూసుకున్నాడు అనడంతో అప్పుడు సౌందర్య మీరందరూ చాలా మంచి వాళ్ళు బాబు దీప కార్తిక్ కంటే మీకు చాలా ఇష్టం వాళ్ళని బాగా చూసుకున్నారు.  నాకు సమస్య అయింది అనడంతో అదేంటి అలా మాట్లాడుతున్నారు అత్తయ్య అనగా మరి ఎలా మాట్లాడాలి నా కొడుకు కోడలు ఫోటో చూపిస్తే తెలియదు అన్నావు కదా అనగా ఇప్పుడు వచ్చారు కదా అమ్మ అనడంతో వచ్చారు.

 కానీ ఇన్నాళ్లు ఎందుకు రాలేదు అన్నా కారణం నాకు తెలియాలి కదా అంటుంది సౌందర్య. అడిగితే చెప్పడం లేదు అని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు కార్తీక్ హేమచంద్ర ఎవరో తెలియదు అన్నట్టుగా చూడడంతో నువ్వు కొత్తగా చూడాల్సిన పనిలేదు మీ అందరికీ పరిచయం ఉందని నాకు ఇందాకే దీప చెప్పింది అని అంటుంది సౌందర్య. మా చుట్టూ ఉండే ఎన్ని నాటకాలు ఆడారు అనగా మమ్మీ అది కాదు వేషాలు చాలురా వంశోద్ధారక అనడంతో దీప నవ్వుతుంది. దాంతో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇందులో శౌర్య హిమ అక్కడికి వచ్చి పాత చెక్కలు కావాలి భోగిమంట వేయాలి అనడంతో వెంటనే కార్తీక్ భయపడుతూ అంత పెద్దమంట అంటే మంట ఎక్కువగా ఉంటుంది ఏమో అంటాడు.
 

అప్పుడు భోగిమంట వేసేదే వేడి కోసం అని చెప్పి సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ భోగిమంట గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత సౌందర్య, చంద్రమ్మ, దీప అందరూ కలిసి పిండి వంటలు చేస్తూ ఉంటారు. అప్పుడు చంద్రమ్మ ఇంద్రుడు దీపని అక్కడి నుంచి పక్కకు లేయడంతో నా కోడలు గురించి ఏమనుకుంటున్నారు దాని పేరే వంటలక్క అద్భుతంగా వంటలు చేస్తుంది అని అంటుంది సౌందర్య. పిల్లలు జంతికలు చెయ్యి అరిసెలు చేయి అని కోరికలు కోరుతూ ఉంటారు. అప్పుడు చంద్రమ్మ ప్రతిసారి దీపమ్మని చేస్తుంది కదా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అమ్మ నేను చేస్తాను అని అనడంతో చూస్తున్న ఏంటి మీ గోల దీపకి పొయ్యి అంటే పడనట్లు చేస్తున్నారు ఏంటి అని సీరియస్ అవుతుంది సౌందర్య.
 

మరోవైపు హేమచంద్ర కార్తీక్ ఇద్దరు దీప హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ వాళ్లకు ఎక్కడ నిజం తెలుస్తుందో అని భయంగా ఉంది హేమచంద్ర అనడంతో తెలియడం కంటే ముందే మీరు చెప్పేస్తే బాగుంటుంది అని అంటాడు హేమచంద్ర.  తట్టుకోలేరు హేమచంద్ర అనడంతో నువ్వే తట్టుకున్నావు కదా అలాగే వాళ్ళు కూడా తట్టుకుంటారు. ఈ ప్రపంచంలో నీకంటే దీపని ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు నా మాట విని ఇంట్లో వాళ్లకు చెప్పు అని అంటాడు.

click me!