బెడ్‌రూమ్‌లో మోనాల్‌ ఫోటో, కార్‌లో అమ్మాయిల పర్‌ఫ్యూమ్‌, సాయిపల్లవిపై క్రష్‌.. షాకిస్తున్న బిగ్‌బాస్‌ అఖిల్‌

First Published Jun 15, 2021, 7:19 PM IST

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ అఖిల్‌ సార్థక్‌ బెడ్‌రూమ్‌లో మోనాల్‌ ఫోటో, కార్‌లో పర్‌ఫ్యూమ్‌ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. సాయిపల్లవిపై క్రష్‌ అంటూ షాక్‌ ఇస్తున్నాడు అఖిల్‌. బోల్డ్‌గా అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మన్మథరాజాగా పాపులర్‌ అయ్యాడు అఖిల్‌ సార్థక్‌. టైటిల్‌ రన్నరప్‌గా నిలిచాడు. ముఖ్యంగా షోలో మోనాల్‌తో లవ్‌ స్టోరీతో పాపులర్‌ అయ్యాడు. ఇద్దరు డీప్‌ లవ్‌ లోకి వెళ్లిపోయారనే టాక్‌ వినిపించింది.
undefined
షో తర్వాత నటుడిగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న అఖిల్‌ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన పర్సనల్‌ విషయాలను బోల్డ్ గా చెప్పింది. తన ఇంటిని, కారుని, బెడ్‌రూమ్‌ని చూపించి ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చాడు.
undefined
స్కూల్‌ టైమ్‌ నుంచి జిమ్‌ అలవాటుందన్నారు. సినిమాల్లో రాణించాలంటే బాడీ బిల్డ్ చేసుకోవాలని, ఫిట్‌గా, అందంగా కనిపించాలని చెప్పేవారట. దీంతో తాను నిత్యం జిమ్‌ చేస్తానని చెప్పాడు.
undefined
సినిమా అవకాశాల కోసం చాలా తిరిగానని, 43కిపైగా ఆడిషన్స్ ఇచ్చానని, అన్నింటిలోనూ విఫలమయ్యాయని చెప్పాడు అఖిల్‌. తన ఫోటోని డస్ట్ బిన్‌లో పడేస్తే చాలా హర్టింగ్‌గా అనిపించేదట. భవిష్యత్‌లో వాళ్లే పిలిచి ఆఫర్లు ఇచ్చే వరకు ఎదగాలను తపనతో ఉన్నానని చెప్పాడు. తనని తాను తక్కువ చేసుకోలేనన్నాడు.
undefined
పెళ్లిపై ఇప్పుడు ఆసక్తి లేదన్నాడు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టినట్టు చెప్పారు. మోనాల్‌తో ఇప్పటికీ రిలేషన్‌ మెయింటేన్‌ చేస్తున్నానని, తను తన ఫ్యామిలీ లాంటిదన్నారు. అంతేకాదు ప్రతి రోజూ ఉదయాన్నే మోనాల్‌కి ఫస్ట్ కాల్‌ వెళ్తుందట. అలాగే నిత్యం గూగుల్‌లో ఆమె ఫోటోనే సెర్చ్‌ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పేశాడు.
undefined
ఇదిలా ఉంటే మోనాల్‌ ఫోటో తన బెడ్‌రూమ్‌లో పెట్టుకోవడం విశేషం. క్లోజ్‌ ఫ్రెండ్స్ తోపాటు మోనాల్‌తో తాను ఉన్న ఫోటోని స్పెషల్‌గా ఫ్రేమ్‌ చేయించుకున్నాడు అఖిల్‌.
undefined
తనకు సిగ్గుపడే, ట్రెడిషనల్‌గా ఉండే అమ్మాయిలంటే ఇష్టమని, మోనాల్‌ చీరలో చాలా అందంగా ఉంటుందని చెప్పాడు. తను తన ఫ్యామిలీ మెంబర్‌ లాంటిదని తన లవర్‌ అని చెప్పకనే చెప్పాడు.
undefined
మోనాల్‌ అంటే తన మమ్మీకి ఇష్టం లేదనే వార్తల్లో నిజం లేదని, అమ్మతో నిత్యం మాట్లాడుతుందని చెప్పాడు. తాను ఫోన్‌ లిఫ్ట్ చేయకపోతే నెక్ట్స్ కాల్‌ వాళ్లమ్మకే వెళ్తుందని చెప్పాడు.
undefined
సెలబ్రిటీల్లో సాయిపల్లవి అంటే క్రష్‌ అని చెప్పాడు అఖిల్‌. ఆమె సహజ నటి అని, డాన్సులు కూడా సహజంగా ఉంటాయని చెప్పారు. స్కూల్‌లో ఇంగ్లీష్‌ మేడంపై క్రష్‌ ఉండేదట.
undefined
ఈ సందర్భంగా అఖిల్‌ కారులో సెంట్‌బాటిల్స్ బయటపడ్డాయి. దాదాపు పది సెంట్‌ బాటిల్స్ పెట్టుకున్నాడు అఖిల్‌. అంతేకాదు అందులో అమ్మాయిలకు సంబంధించి పర్‌ఫ్యూమ్‌ బాటిల్స్ కూడా ఉండటం విశేషం.
undefined
తనకు సుకుమార్‌, త్రివిక్రమ్‌, రాజమౌళి వంటి దర్శకులంటే ఇష్టమని తెలిపాడు. వీరి సినిమాల్లో నటించాలనుందని పేర్కొన్నాడు.
undefined
మరోవైపు విలన్‌గా రాణించాలనుందని తన కోరికని వెల్లడించారు. ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబులకు సన్‌గా విలన్‌ పాత్రలు చేయాలనుందని వెల్లడించాడు అఖిల్‌.
undefined
దీంతోపాటు ప్రస్తుతం `ఫస్ట్ టైమ్‌` అనే సినిమాలో నటిస్తున్నాడట. తనకిది డెబ్యూ అని చెప్పాడు. పలు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నట్టు వెల్లడించాడు. చాలా బోల్డ్ గా తన పర్సనల్‌ విషయాలను పంచుకుని షాక్‌ ఇచ్చాడు అఖిల్‌.
undefined
click me!