సినిమా టికెట్లు, మద్యం అమ్ముతున్నామా.. చిరంజీవి, నాగార్జునే అడిగారు.. రోజా షాకింగ్ కామెంట్స్

First Published Sep 18, 2021, 1:57 PM IST

ఏపీలో సినిమా థియేటర్ వ్యవస్థ, నిబంధనలపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమపై సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఏపీలో సినిమా థియేటర్ వ్యవస్థ, నిబంధనలపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమపై సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి. టికెట్ టికెట్ ధరల విషయంలో థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు. 

దీనితో చాలా మంది నిర్మాతలు థియేటర్ రిలీజ్ కంటే ఓటిటి నే సేఫ్ అనే ఫీలింగ్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ సమస్యలు చర్చించేందుకు సీఎం జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. దీనితో జగన్ అపాయింట్మెంట్ కుదిరాక చిరంజీవి సినీ ప్రముఖులతో కలసి జగన్ ని మీట్ కానున్నారు. ఈ మీటింగ్ ఈ నెలాఖరులో కానీ, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈలోగా జగన్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఉపక్రమించింది. సినిమా టికెట్లని స్వయంగా ప్రభుత్వమే ఆన్లైన్ లో విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై మంత్రి పేర్ని నాని కూడా అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మంచి నిర్ణయమే అని కొందరు అంటుంటే.. డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మరికొందరు విమర్శిస్తున్నారు. 

ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా కూడా విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వం మద్యం,సినిమా టికెట్లు అమ్ముకుంటోంది అంటూ వస్తున్న విమర్శలకు నటి, ఎమ్మెల్యే రోజా స్పందించారు. 

నేడు రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సినిమా టికెట్లు, మద్యం అమ్ముతోంది అంటూ టిడిపి నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. 

సినీ పెద్దలు కోరడంతోనే ప్రభుత్వం ఆన్లైన్ లో టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులే ఆన్లైన్ టికెట్లు అమ్మాలని జగన్ ని రిక్వస్ట్ చేసినట్లు రోజా తెలిపారు. అందువల్లే జగన్ ఆన్లైన్ టికెట్ల నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని.. ఇందులో స్వలాభం ఏమీ లేదని రోజా పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే సినీ పెద్దలు, జగన్ మీటింగ్ పై చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చిత్ర పరిశ్రమ సమస్యలు ఈ మీటింగ్ తో పరిష్కారం అవుతాయని అంతా ఎదురుచూస్తున్నారు. 

click me!