'వాల్తేరు వీరయ్య' సెన్సార్ టాక్ లీక్.. ఫస్ట్ హాఫ్ లో మైనస్ అదే, సెకండాఫ్ లో అసలు సిసలైన జాతర ?

First Published Jan 4, 2023, 3:24 PM IST

తాజాగా వాల్తేరు వీరయ్య సెన్సార్ ముగిసింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యుఏ' సర్టిఫికేట్ అందించారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి అభిమానులని ఉర్రూతలూగించేందుకు 'వాల్తేరు వీరయ్య'గా వచ్చేస్తున్నారు. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

మరికొన్ని రోజుల్లో మెగా ఫ్యాన్స్ నిరీక్షణకి తెరపడనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సెన్సార్ ముగిసింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యుఏ' సర్టిఫికేట్ అందించారు. దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రానికి లాక్ చేసిన రన్ టైం 2 గంటల 40 నిమిషాలు. 

మెగాస్టార్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్ టైం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి వచ్చిన సెన్సార్ టాక్ కూడా లీక్ అయింది. ఫస్ట్ హాఫ్ మెగాస్టార్ మార్క్ ఫన్ ఎలిమెంట్స్ తో కాస్త రొటీన్ గా ఉంటుందట. కానీ ఎంటర్టైన్మెంట్ కి ఢోకా ఉండదని అంటున్నారు. అసలైన మాస్ జాతర ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మొదలవుతుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో మెగా ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా అని సమాచారం. 

సెకండ్ హాఫ్ లో రవితేజ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. 40 నిమిషాల పాటు రవితేజ పాత్ర ఉంటుందట. రవితేజ, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు కట్టి పడేస్తాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ ని ఫ్యాన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఈ చిత్రం అంత భారీ విజయం సాధిస్తుందని అంటున్నారు. 

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఆశించిన సంగీతం అందించలేదని చెప్పాలి. స్క్రీన్ పై రెండు పాటలు మాత్రమే బావున్నాయట. రెగ్యులర్ కమర్షియల్ చిత్రమే అయినప్పటికీ సంక్రాంతికి పర్ఫెక్ట్ ప్యాకేజ్ మూవీని అంటున్నారు. మరోవైపు బాలయ్య వీరసింహారెడ్డి కూడా రిలీజ్ అవుతుండడంతో పోటీ ఎలా ఉంటుందో చూడాలి. పైగా ఈ రెండు చిత్రాలని నిర్మించినది మైత్రి మూవీస్ వారే. 

వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కేథరిన్ కీలక పాత్రలో మెరిసింది. నిర్మాతలు త్వరలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి ట్రైలర్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

click me!