పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి చర్చ, మెగా పవర్ స్టార్ ను ఏంమంటున్నారంటే..?

First Published Mar 8, 2024, 11:14 AM IST

గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ఇండియాతో పాటు.. ప్రపంచ దేశాల్లో ఆయన క్రేజ్ మారుమోగిపోతోంది. చివరికి పాకిస్తాన్ లో కూడా చరణ్ గురించి చర్చ మొదలయ్యింది. 
 

ఒక్క సినిమాతో తన సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు రామ్ చరణ్. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరాన్ కూడా చరణ్ నటనను ప్రశంసించాడంటే.. మెగా పవన్ స్టార్ గురించి ఇంతకంటే చెప్పేది ఉండదు. ఆకరికి మన దాయాదీ దేశం అయిన పాకిస్తాన్ లో కూడా రామ్ చరణ్ గురించి చర్చ మొదలయ్యింది. 
 

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మోతమోగిపోతుంది. ఆ సినిమాలో సీతారామ రాజు పాత్రలో పలు వేరియేషన్స్ చూపించి టాలీవుడ్ మాత్రమే కాకుండా... బాలీవుడ్, హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా.. ఈ సినిమా కోసం చరణ్ మేకోవర్.. యాక్టింగ్, హ్యాండ్సమ్ లుక్స్.. ఆడియన్స్ ను కట్టిపడేశాయి. 

Ram Charan

వేలమంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ విజుల్స్ వేయించింది. తాజాగా ఈ యాక్షన్ సీన్ గురించి, రామ్ చరణ్ ఇంటెన్స్ యాక్టింగ్ గురించి పాకిస్తాన్ మీడియాలో మాట్లాకోవడం విశేషం. పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో.. ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
 

పాకిస్తాన్ మీడియాలో... ఈ విధంగా చర్చ జరిగింది. ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయి.. మరీ ముఖ్యంగా వేలమంది మధ్యలోకి దూకి ఫైట్ చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడడం మైండ్ బ్లోయింగ్ అనిపించింది.. అంటూ చర్చించుకోవడం విశేషంగా చెప్పుకొచ్చారు.
 

ప్రస్తుతం ఈ చర్చకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవ్వడంతో పాటు.. ఈ వీడియోని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. మన శత్రు దేశమైన పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం అంటే మాములు విషయం కాదంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. 

ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ నెల మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది. ఇంతకు ముందు చెప్పినట్టే.. జరగండి జరగండి.. సాంగ్ అప్డేట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈసినిమాలో చరణ్ జోడీగా కియారా అద్వాని  సందడి చేయబోతోంది. 
 

click me!