గరికపాటి అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. వీడియో వైరల్ చేస్తూ ట్రోలింగ్, రంగంలోకి నాగబాబు

First Published Oct 7, 2022, 8:24 AM IST

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు గురువారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హజాయ్యారు.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు గురువారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హజాయ్యారు. గరికపాటి నరసింహా రావు కూడా ప్రవచనం ఇచ్చేందుకు హాజరయ్యారు. చిరు, గరికపాటి మధ్య చోటు చేసుకున్న సంఘటన హాట్ టాపిక్ గా మారింది. 

చిరంజీవి రావడంతో అక్కడున్న అభిమానులు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. దీనితో ప్రవచనం చెబుతున్న గరికపాటికి అసహనం కలిగింది. చిరంజీవిగారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపు రావాలి. లేకుంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతారు. నాకు ఎలాంటి మొహమాటం లేదు. చిరంజీవి ఫోటో షూట్ ఆపేయండి లేదా నాకు సెలవు ఇప్పించండి అంటూ మాట్లాడారు. 

అనంతరం చిరంజీవి గరికపాటితో మాట కలిపి పరిస్థితి చక్కదిద్దారు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. కానీ గరికపాటి మాటలు మెగా అభిమానులని బాగా ఇబ్బంది పెట్టినట్లు ఉన్నాయి. ఆయన చిరంజీవిపై అక్కసుతోనే ఇలా మాట్లాడారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. చిరంజీవి లాంటి వారు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది. దానిని నిర్వాహకులు చక్కదిద్దాలి లేదా ఓపికగా ఉండాలి అంటూ గరికపాటికి చురకలు అంటిస్తున్నారు. 

మరికొందరు మాత్రం గరికపాటికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గరికపాటి గతంలో చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను మెగా అభిమనులు వైరల్ చేస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానుల అసోసియేషన్ లో ఉండే వాడిని అని గరికపాటి చెబుతున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి. 

ఏఎన్నార్ సినిమా విడుదలైతే పోస్టర్స్ పై పేడ వేయడం కూడా చేశాం అంటూ గరికపాటి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానిగా గరికపాటి అప్పట్లో అలా వ్యవహరించారు. చిరంజీవిపై అక్కడున్న వారు అభిమానంతో ఫోటోలు దిగుతుంటే కాసేపు ఓపిగ్గా ఉండలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. 

మెగా బ్రదర్ నాగబాబు కూడా రంగంలోకి దిగి గరికపాటిపై సెటైర్లు వేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పరిపాటే అంటూ సెటైర్లు వేయడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లు అయింది. 

click me!